న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

41 బంతుల్లో 11వ హాఫ్‌సెంచరీ: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

IPL 2019 : KL Rahul Completed His 11th Half Century Off 41 Balls || Oneindia Telugu
SRH vs KXIP: KL Rahul Completed his no. 11 Half Century off 41 Balls

హైదరాబాద్: ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వేదికలో ఒకే రోజు హాఫ్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఏప్రిల్ 8(ఆదివారం) మొహాలి వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

151 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్

151 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్

అనంతరం సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్య చేధనకు దిగిన పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 71 నాటౌట్(7 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. రాహుల్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ 43 బంతుల్లో 55(3ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.

పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 19 పరుగులు

చివర్లో పంజాబ్ విజయానికి 18 బంతుల్లో 19 పరుగులు అవసరమయ్యాయి. అదే సమయంలో మయాంక్‌, మిల్లర్‌(1), మన్‌దీప్‌ సింగ్‌(2) వరుసగా పెవిలియన్‌కు చేరారు. దీంతో విజయం సన్‌రైజర్స్‌‌ను వరిస్తుందని అంతా భావించారు. కానీ, చివర్లో మరో బంతి మిగిలుండగానే పంజాబ్ విజయం సాధించింది.

మొహాలిలో ఏడాది క్రితంగా సరిగ్గా ఇదే రోజున

మొహాలిలో ఏడాది క్రితంగా సరిగ్గా ఇదే రోజున

ఇదిలా ఉంటే, మొహాలిలో ఏడాది క్రితంగా సరిగ్గా ఇదే రోజున (ఏప్రిల్‌ 8) ఐపీఎల్ 2018 సీజన్‌లో రాహుల్‌ హాఫ్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆ మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

ఈ క్రమంలో 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి యూసఫ్‌ పఠాన్‌(15 బంతుల్లో) పేరిట ఉన్న ఫాస్టెస్ట్‌ హాఫ్ సెంచరీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టాడు. 2015 సన్స్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ ఈ రికార్డుని నెలకొల్పాడు. ఇలా ఏడాది వ్యవధిలో ఒకే రోజున కేఎల్ రాహుల్ నమోదు చేసిన హాఫ్ సెంచరీ రికార్డు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అయింది.

Story first published: Tuesday, April 9, 2019, 14:36 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X