న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిద్ధార్థ్ కౌల్.. హెడ్ బ్యాండ్ సెంటిమెంటా.. ఏదైనా మ్యాజికా??

SRH speedster Siddarth Kaul reacts to the tweets of the fans

హైదరాబాద్: రెండు సంవత్సరాలుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడి అదరగొడుతున్న సిద్ధార్థ్ కౌల్‌పై పలువురికి సందేహాలు నెలకొన్నాయి. టోర్నీ ఆరంభం నుంచే ధాటిగా బౌలింగ్‌ చేస్తూ డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టుగా మారిన కౌల్‌.. ఒకానొక దశలో పర్పుల్‌ క్యాప్‌ పోటీలో నిలిచాడు. బౌలింగే ప్రధాన బలంగా విజయాలు సాధించిన రైజర్స్ జట్టులో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించాడు. తమ జట్టు బ్యాట్స్‌మెన్ చాలా తక్కువ పరుగులు చేయడంతో స్వల్ప లక్ష్యాలు ఏర్పడేవి. అలాంటి సమయంలోనూ చాకచక్యంగా, ఓర్పుతో ఎదుర్కొంది హైదరాబాద్ జట్టు.

17మ్యాచ్‌లాడి 21వికెట్లు పడగొట్టి

17మ్యాచ్‌లాడి 21వికెట్లు పడగొట్టి

బంతి అందుకోవడమే ఆలస్యం.. వెంటనే వికెట్‌ తీసి ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేయడంలో కౌల్‌ దిట్టగా మారాడు. అలా టోర్నీ మొత్తం నిలకడైన ప్రదర్శనతో రాణించిన ఈ కుడి చేతి వాటం బౌలర్‌.. 17మ్యాచ్‌లాడి 21వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

బరిలోకి దిగేముందు తలకు హెడ్‌బ్యాండ్‌ పెట్టుకొని

బరిలోకి దిగేముందు తలకు హెడ్‌బ్యాండ్‌ పెట్టుకొని

ప్రస్తుతం ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపికైన ఇతను‌.. తాజాగా ట్విటర్‌లో అభిమానులడిగిన కొన్ని ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తమ ట్విటర్‌ ఖాతా ద్వారా పంచుకుంది. దీనిలో భాగంగా ప్రతిసారి బరిలోకి దిగేముందు తలకు హెడ్‌బ్యాండ్‌ పెట్టుకొని కనిపిస్తుంటారు..దాని వల్ల మీకేమైనా కలిసివచ్చిందా? అని ఓ అభిమాని కౌల్‌ను ప్రశ్నించాడు.

 ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి అదో ట్రేడ్‌మార్కుగా

ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి అదో ట్రేడ్‌మార్కుగా

దీనికి స్పందించిన కౌల్‌..‘హెడ్‌బ్యాండ్‌లో ఎలాంటి మ్యాజిక్‌ లేదని పేర్కొన్నాడు. అది ఉంటేనే వికెట్లు పడతాయన్న దాంట్లో ఎలాంటి నిజం లేదు. మన కష్టం మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది. నేను నా కష్టాన్ని నమ్ముకున్నాను. విజయం సాధించాను. అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇక హెడ్‌బ్యాండ్‌ అంటారా ఐపీఎల్‌లోకి వచ్చినప్పటి నుంచి అదో ట్రేడ్‌మార్కుగా మారిందంటూ' కౌల్‌ చెప్పుకొచ్చాడు.

ముఖం మీద విసురుతారా అంటూ..

ముఖం మీద విసురుతారా అంటూ..

మైదానంలో మాదిరిగానే నకుల్‌బాల్‌ను ఇతరుల ముఖం మీద విసురుతారా అంటూ.. మరో అభిమాని అడిగిన సరదా ప్రశ్నకు సమాధానంగా,‘ అలాంటిదేమీ లేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్లంతా ఆనందంగా ఉండాలనే కోరుకుంటాను. ఎదుటివారిని ఉత్సాహపరచడానికే అలాంటి పనులు చేస్తుంటాను. తప్ప వేరే ఉద్దేశంతో కాదని' కౌల్‌ తెలిపాడు.

Story first published: Sunday, June 10, 2018, 14:44 [IST]
Other articles published on Jun 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X