న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వకార్ యూనిస్ ఎవరో తెలియదు.. ఆ ముగ్గురు భారత పేసర్లే నా హీరోలు: ఉమ్రాన్ మాలిక్

SRH Speedstar Umran Malik said he never followed the Waqar Younis, his idols are Bumrah, Shami, Bhuvi

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా భవిష్యత్ స్టార్‌ అవుతాడంటూ క్రికెట్ పండితులు తమ అభిప్రాయాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2022 సీజన్లో రాణించడంతో ఉమ్రాన్ మాలిక్ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇకపోతే జమ్మూకి చెందిన ఈ 22ఏళ్ల ఫాస్ట్ బౌలర్ తన మెరుపు పేస్‌తో బ్యాటర్లను దడదడలాడించాడు. గంటకు 150కిలోమీటర్ల (93 మైళ్లు) కంటే ఎక్కువ వేగంతో బంతులు వేశాడు. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన (156.9 కి.మీ.) బౌలింగ్ చేసిన భారత ప్లేయర్‌గా ఉమ్రాన్ నిలిచాడు. ఇక ఉమ్రాన్ 14మ్యాచ్‌ల్లో 22వికెట్లు పడగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్‌తో సహా మాజీ ఆటగాళ్ల నుంచి అతనికి ప్రశంసలు దక్కాయి.

నాకంటూ ప్రత్యేక శైలి ఉంది..

నాకంటూ ప్రత్యేక శైలి ఉంది..

ఇక ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీ.. ఉమ్రాన్ మాలిక్ పేస్ చూస్తుంటే పాక్ లెజెండరీ బౌలర్ వకార్ యూనిస్‌ ఖాన్ గుర్తుకొస్తున్నాడంటూ పేర్కొన్నాడు. ఇక ఉమ్రాన్ మాలిక్‌ను ఈ విషయం గురించి ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూవర్ ప్రశ్నించగా.. నేను నా సబ్ కాన్సియస్ మైండ్ (పొరపాటున కూడా)తో కూడా ఏ పాకిస్థాన్‌ బౌలర్‌ను అనుసరించలేదు, అనుసరించబోను అని పేర్కొన్నాడు. ఇక తాను క్రికెట్లో ఆరాధించే బౌలర్ల గురించి ఉమ్రాన్ పేర్కొంటూ.. 'నేను వకార్ యూనిస్‌ని అనుసరించలేదు. నాకంటూ ప్రత్యేకమైన ఓ శైలి ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ భాయ్‌ నేను ఆరాధించే ప్లేయర్లు. వాళ్లను అనుసరిస్తూనే నేను నా కెరీర్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను' అని పేర్కొన్నాడు.

ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాలనేది నా లక్ష్యం

ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాలనేది నా లక్ష్యం

ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపికవ్వడం పట్ల ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ.. 'దేశం కోసం ఆడడం గర్వంగా ఉండబోతుంది. టీమిండియాకు నా వంతు కృషి చేయాలనుకుంటున్నాను. ఐదు టీ20 మ్యాచ్‌ల దక్షిణాఫ్రికా సిరీస్‌లో నాకు అవకాశం దక్కింది. మొత్తం ఐదు మ్యాచ్‌లను గెలవడమే నా లక్ష్యం. నేను బాగా రాణిస్తాను. టీమిండియా కోసం ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించి ఇవ్వాలనేది నా లక్ష్యం'అని మాలిక్ పేర్కొన్నాడు. ఇకపోతే ఐపీఎల్లో తన ప్రదర్శన తర్వాత తనకు దక్కుతున్న ఆదరాభిమానాల గురించి ఉమ్రాన్ మాట్లాడుతూ.. టీమిండియా నలుమూలల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, అభిమానానికి నిజంగా ధన్యవాదాలు చెబుతున్నాం. మా బంధువులు, ఎంతోమంది మా ఇంటికి వస్తూ నన్ను విష్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఐపీఎల్ తర్వాత నేను కాస్త బిజీ అయిపోయినప్పటికీ నా ప్రాక్టీస్ మాత్రం ఆపలేదు' అని ఉమ్రాన్ పేర్కొన్నాడు.

 దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు ఎంపికైన టీమిండియా జట్టు

దక్షిణాఫ్రికా సిరీస్‌‌కు ఎంపికైన టీమిండియా జట్టు

ఇకపోతే రోహిత్ గైర్హాజరీలో దక్షిణాఫ్రికాతో జరిగే 5టీ20ల సిరీస్‌కు టీమిండియా పగ్గాలు కేఎల్ రాహుల్ చేపట్టనున్నాడు. జూన్ 9న గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది. ఈ జట్టులో ఉమ్రాన్ మాలిక్ పేసర్ గా ఎంపికయ్యాడు.

టీమిండియా టీ20 జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)(వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ చాహల్ , అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్

Story first published: Monday, June 6, 2022, 13:36 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X