న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2021 వాయిదా.. నెట్టింట పేలుతున్న సెటైర్లు! సన్‌రైజర్స్ ఫాన్స్ అయితే యమ హ్యాపీ! ఏమంటున్నారంటే?

SRH Fans trends mems on Twitter after IPL 2021 Suspeneded
IPL 2021 వాయిదా Kaviya Maran PAPA Happy - SRH Fans యమ హ్యాపీ! పాపం RCB || Oneindia Telugu

హైదరాబాద్: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడటంతో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఈ సీజన్‌ను అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రేమికులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆటగాళ్ల భద్రత, క్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కరోనా కేసులు నమోదయిన విషయం తెలిసిందే.

IPL 2021: ఆసీస్ క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా!!IPL 2021: ఆసీస్ క్రికెటర్లకు భారీ షాక్‌ ఇచ్చిన క్రికెట్‌ ఆస్ట్రేలియా!!

30 మ్యాచ్‌లు మాత్రమే:

ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకారం మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకూ కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ముగిసాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరింటిలో గెలుపొంది 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 7 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడి ఐదు విజయాలు అందుకుని 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఇక ముంబై ఇండియన్స్ నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.

ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం:

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ద్వారా ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాల్ని సంక్లిష్టంగా హైదరాబాద్ మార్చుకుంది. ప్లేఆఫ్ వెళ్లడం దాదాపు అసాధ్యమే. తాజాగా ఐపీఎల్ 2021 వాయిదాతో సన్‌రైజర్స్ జట్టు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫన్నీగా మీమ్స్‌, కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. టాప్-4లో ఉన్న జట్లు మినహా.. మిగిలిన నాలుగు జట్లు సీజన్ వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అభిమానులు మీమ్స్‌ ట్రెండ్ చేస్తున్నారు.

కావ్య మారన్‌ సంతోషించే వార్త:

సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్‌ సంతోషించే వార్త అంటూ నెటిజన్లు జోక్‌లు వేస్తున్నారు. 'ఐపీఎల్‌ రద్దవ్వడం వల్ల అత్యంత సంతోషపడే వ్యక్తి కావ్య మారన్‌' అని అభిమాని ట్వీట్ చేయగా.. 'హమ్మయ్య.. ఐపీఎల్ రద్దయింది. మా సన్‌రైజర్స్ బతికిపోయింది' అని ఇంకొకరు పేర్కొన్నారు. అంతకుముందు కూడా సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అభిమానులు 'Cancel IPL' అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫాన్స్ కూడా తమ ఆనందాన్ని నెట్టింట పంచుకుంటున్నారు.

తప్పనిసరి పరిస్థితుల్లో:

సోమవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్ జట్టులోని బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా వైరస్ బారినపడగా.. గంటల వ్యవధిలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, సీఈవో కాశీ విశ్వనాథన్‌తో పాటు చెన్నై టీమ్ బస్ క్లీనర్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకీ కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేశారు.

Story first published: Tuesday, May 4, 2021, 21:48 [IST]
Other articles published on May 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X