న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

marco jansen : ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్ మూటగట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్

SRH Bowler Marco Jansen Bags Worst Record By Conceding 63 Runs In 4 Overs

ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 195పరుగులు చేసింది. కానీ ఈ స్కోరును సన్ రైజర్స్ కాపాడుకోలేకపోయింది. సన్ రైజర్స్ బౌలర్లు గుజరాత్ బ్యాటర్ల ధాటికి తేలిపోయారు. ఒక్క ఉమ్రాన్ మాలిక్ మినహా మిగతా బౌలర్లు ఒక్కరు కూడా వికెట్ తీయలేదు. సన్ రైజర్స్ జట్టులోని అయిదుగురు బౌలర్లు తలా 4ఓవర్లు వేశారు. వాషింగ్టన్ సుందర్ తన స్పెల్‌లో 34పరుగులు ఇవ్వగా.. టీ.నటరాజన్ 43పరుగులు, భువనేశ్వర్ కుమార్ 33పరుగులు, ఉమ్రాన్ మాలిక్ 5వికెట్లు తీసి 25పరుగులు ఇచ్చారు.

ఇక యువ బౌలర్ మార్కో జాన్సేన్ ఈ మ్యాచ్‌లో తన స్పెల్‌లో ఏకంగా 63పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డ్ చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి పేరిట ఉండేది. 2019లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఎంగిడి 62పరుగులు ఇచ్చాడు.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సేన్ తన మొదటి స్పెల్ అయిన 2వ ఓవర్లోనే 18పరుగులు ఇచ్చాడు. 5ఓవర్ వేసిన జాన్సేన్ కేవలం 7పరుగులే ఇచ్చి టచ్‌లోకి వచ్చాడనుకుంటే.. 12వ ఓవర్లో మళ్లీ 13పరుగులు ఇచ్చాడు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జాన్సేన్.. 22పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు. ఆ ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాతీయా లాంగ్ ఆన్లో సిక్సర్ బాదాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది.

3వ బంతికి రషీద్ క్రీజులోకి వచ్చాడు. ఆ బంతికి రషీద్ స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. 4వ బంతికి డాట్ పడింది. ఇక 2బంతుల్లో 9పరుగులు కావాల్సిన తరుణంలో 5వ బంతికి మార్కో జాన్సేన్ ఫుల్ టాస్ వేయగా.. దాన్ని ఆఫ్ సైడ్ సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో షార్ట్ పిచ్ బంతి వేయగా.. రషీద్ బ్యాట్‌కు ఎడ్జ్ అయ్యి బంతి బౌండరీ అవతల పడింది. దీంతో గుజరాత్ గెలుపొందింది. చివరి ఓవర్లో ఏకంగా 25పరుగులు ఇచ్చాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన్ సన్ రైజర్స్.. అభిషేక్ శర్మ (65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్క్రామ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో శశాంక్ సింగ్ (25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో 195పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన గుజరాత్‌ ఓపెనర్ సాహా (68పరుగులు 38బంతుల్లో 11ఫోర్లు 1సిక్సర్లు), శుభ్‌మన్ (22) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాతీయా (40పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్), రషీద్ ఖాన్ (31పరుగులు 11 బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్ ) చెలరేగడంతో గుజరాత్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Thursday, April 28, 2022, 8:10 [IST]
Other articles published on Apr 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X