న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాలా కాలం తర్వాత: సోషల్ మీడియా లైవ్ ద్వారా అభిమానులతో కనెక్ట్ కానున్న శ్రీశాంత్

Sreesanth to go live on social media

కరోనావైరస్ మనుషులను భౌతికంగా దూరం చేసినప్పటికీ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం ఒకరితో ఒకరు టచ్‌లో ఉంటున్నారు. ఇది సెలబ్రిటీలకు కూడా మినహాయింపు కాదు. ఇప్పటికే ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలో పలువురు సినిమా సెలిబ్రిటీల నుంచి స్పోర్ట్స్ సెలబ్రిటీలవరకు అవగాహన తీసుకొస్తూ తమవంతు పాత్ర పోషిస్తున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. తన అభిమానులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ కేరళ సూపర్ ఎక్స్‌ప్రెస్ సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ ‌తో కనెక్ట్ అయ్యే శ్రీశాంత్... తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ హెలో ద్వారా ముందుకు రానున్నారు. ఫ్యాన్స్‌తో ముచ్చటించనున్నాడు. తన మనోగతాన్ని బయటపెట్టనున్నాడు.

సాయంత్రం 7:30 గంటలకు హెలో యాప్‌లో లైవ్ ద్వారా తన అభిమానులను క్రికెట్ ఫ్యాన్స్‌ను శ్రీశాంత్ కలవబోతున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు తాను లైవ్ ద్వారా సమాధానం ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు శ్రీశాంత్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. చాలా కాలం తర్వాత శ్రీశాంత్ లైవ్‌లో వస్తున్నట్లు సమాచారం. తనతో ముచ్చటించాలనుకుంటున్న అభిమానులు తనతో హెలో యాప్‌పై కనెక్ట్ కావాలని పిలుపునిచ్చాడు. ఇదిలా ఉంటే తన క్రికెట్ కెరీర్‌పై శ్రీశాంత్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రకటన చేస్తారా అనే చర్చ అభిమానుల్లో సాగుతోంది. అభిమానులు కూడా శ్రీశాంత్ ఏం మాట్లాడబోతున్నాడా అంటూ ఆతురుతతో ఎదురు చూస్తున్నారు.

ఇక క్రికెట్ ప్రొఫెషన్‌కు వస్తే శ్రీశాంత్ వివాదాస్పద క్రికెటర్‌గా ముద్రవేసుకున్నాడు. గ్రౌండ్‌లో ఆగ్రహం వ్యక్తం చేయడం, కొన్నిసార్లు అసహనంకు గురికావడం వంటివి చూశాం. సాఫీగా సాగుతున్న శ్రీశాంత్ క్రికెట్ జీవితాన్ని.. ఐపీఎల్ మ్యాచ్‌ఫిక్సింగ్ భూతం కుదిపేసింది. విచారణ తర్వాత కేరళ హైకోర్టు శ్రీశాంత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ తనపై విధించిన జీవితకాలం నిషేధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టులు నిర్దోషిగా తేల్చాక శ్రీశాంత్‌పై జీవితకాలం నిషేధం విధించడం సబబు కాదంటూ గతేడాది వ్యాఖ్యానించింది.

2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శ్రీశాంత్..తొలి టెస్టును 2006లో ఇంగ్లాండ్‌పై ఆడాడు. ఇక చివరి టెస్టు2011 ఆగష్టులో అదే ఇంగ్లాండ్ జట్టుపై ఆడాడు. ఇక తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ 2005 అక్టోబరులో శ్రీలంకపై ఆడగా చివరి మ్యాచ్‌ను అదే శ్రీలంక జట్టుపై 2011లో ఆడాడు. ఇక ఐపీఎల్ విషయానికొస్తే కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌ జట్టుకు, కొచ్చి టస్కర్స్ కేరళ, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టు మ్యాచుల్లో 87 వికెట్లు తీయగా, వన్డే మ్యాచుల్లో 75 వికెట్లు, టీట్వంటీలో 7 వికెట్లు తీశాడు.

Story first published: Friday, April 17, 2020, 14:35 [IST]
Other articles published on Apr 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X