న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లో స్పాట్ ఫిక్సింగ్: ఎలా పని చేస్తుంది?

By Nageshwara Rao
Spot fixing in cricket: How does it work

హైదరాబాద్: ప్రతిషాత్మక యాషెస్ సిరిస్‌లో మూడో టెస్టుకు ముందు ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్లకు చెందిన ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు రాడవంతో ఐసీసీ అప్రమత్తమైంది.

<strong>పూర్తి పాఠం: యాషెస్ టెస్టు సిరిస్‌ను ఫిక్సింగ్ బాగోతం ఇలా వెలుగులోకి</strong>పూర్తి పాఠం: యాషెస్ టెస్టు సిరిస్‌ను ఫిక్సింగ్ బాగోతం ఇలా వెలుగులోకి

పెర్త్‌లోని వాకా స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఫిక్సింగ్‌ జరిగిందంటూ బ్రిటిష్‌ వార్తా పత్రిక సన్‌లో కథనాలు వచ్చాయి. దీంతో ఐసీసీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు విచారణకు కూడా ఆదేశించింది. ఇద్దరు బుకీలు ఫిక్సింగ్‌ను ప్రోత్సహించారని.. అందులో ఒకరు భారత్‌కు చెందిన వ్యక్తి అని సన్‌ కథనంలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అనే రెండు పదాలు గురువారం తెరపైకి వచ్చాయి. స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏమిటి? మ్యాచ్ ఫిక్సింగ్ అంటే ఏమిటి? ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్‌కు ఎలా పాల్పడతారనేది తెలుసుకుందాం.


స్ఫాట్ ఫిక్సింగ్:
స్ఫాట్ ఫిక్సింగ్ అనేది క్రికెటర్, బుకీ మధ్య ఉండే మ్యూచువల్ అగ్రిమెంట్. స్పాట్ ఫిక్సింగ్‌ను కనుక్కొవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఫిక్సింగ్ కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య మాత్రమే జరుగుతుంది. ఆటగాడు కేవలం సైగల ద్వారా బుకీకి తెలియజేస్తాడు.


మైదానంలో ఉన్న ఆటగాడు బుకీకి ఎలా తెలియజేస్తాడు?
మైదానంలో ఉన్న ఆటగాడు తాను ఫిక్స్ చేయబోతున్నట్లు బుకీకి ఎలా తెలియజేస్తాడని అనుకుంటున్నారా? సాధారణంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడే క్రికెటర్ ఓవర్ మొదట్లోనే బుకీకి తెలిసేలా ప్రవర్తిస్తాడు. ఆటగాడు తన చేతిలో ఉన్న చేతికి ఉన్న వాచ్, హెడ్ గేర్ లేదా చేతికి ఉన్న బ్యాండ్ ద్వారా బుకీకి తెలియజేస్తాడు.


'ఫిక్స్' మెసేజ్:
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బౌలర్ నోబాల్, పుల్ టాస్ బంతి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండేలా ఈ బంతి ఉంటుంది. అంటే పుల్ టాస్ బంతికి బ్యాట్స్‌మన్ ఔట్ అయిన అంఫైర్ దానిని నో బాల్‌గా పరిగణించడం లేదా క్రీజు వద్ద నో బాల్ అవడం లాంటివి జరుగుతాయి.


ఆటగాడిని బుకీ ఎలా గుర్తిస్తాడు?
ఇది కొంచెం సుదీర్ఘమైన ప్రక్రియ. బుకీలు లేదా ఏజెంట్లు జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లను మాజీ ఆటగాళ్ల ద్వారా కలుస్తారు. ఆ తర్వాత వారిని నేరుగా కలిసి ఆటగాడిని అడిగిన మొత్తం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ఒప్పందం కుదుర్చుకునేందుకు గాను బుకీలు ఆటగాళ్లకు అప్పుడప్పుడు అమ్మాయిలను కూడా ఎరగా వేస్తుంటారు.


ఇప్పటివరకు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురైన ఆటగాళ్లు
శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్, హికెన్ షా, మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ అమీర్, సల్మాన్ బట్, మొహమ్మద్ అష్రాఫుల్, డానిష్ కానేరియా, లౌ విన్సెంట్, షార్జెల్ ఖాన్, మార్లోన్ శామ్యూల్స్‌లతో పాటు మరికొందరు ఉన్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 17:27 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X