న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచాన్ని మార్చే శక్తి క్రీడలకు ఉంది.. జాతి వివక్షపై స్పందించిన సచిన్!!

Sport Has the Power to Change the World: Writes Sachin as He Takes Stand Against Racism

ముంబై: పోలీసుల దౌర్జన్యం వల్ల ఆఫ్రో‌-అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌ మే 25న మరణించిన విషయం తెలిసిందే. జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక ఫ్లాయిడ్‌ మెడపై పోలీసు ఆఫీసర్ మోకాలిని ఉంచి ఊపిరి ఆడకుండా చేసిన వీడియో వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి. ఫ్లాయిడ్ మృతిపై బిజినెస్, సినీ, రాజకీయ, క్రీడాకారులు సంతాపం తెలుపుతూ జాతి వివక్ష హేయమని ఖండిస్తున్నారు.

ధోనీ జట్టులో లేకపోతే.. కోహ్లీ సక్సెస్ కాలేడు: వసీం జాఫర్ధోనీ జట్టులో లేకపోతే.. కోహ్లీ సక్సెస్ కాలేడు: వసీం జాఫర్

ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) క్రికెట్‌లో జాతి వివక్షకి స్థానం లేదని తాజాగా పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియోను సైతం పోస్ట్ చేసింది. బార్బడోస్‌లో పుట్టి పెరిగిన ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్.. క్రికెట్ పుట్టినిళ్లు ఇంగ్లండ్ తరఫున 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడిన వీడియోని షేర్ చేసింది. గత ఏడాది జోప్రా ఆర్చర్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌, సూపర్ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్ అద్భుతం. వీడియోలో ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు మైదానంలోని వేల మంది అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా జాతి వివక్షపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఐసీసీ షేర్ చేసిన వీడియోని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు మాజీ దక్షిణాఫ్రికా అధ్యకుడు నెల్సన్ మండేలా వ్యాఖ్యలని జత చేశాడు. 'నెల్సన్ మండేలా ఒకసారి ఇలా అన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి క్రీడకు ఉంది. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే శక్తి కూడా ఉంది. అద్భుతమైన పదాలు' అని సచిన్ రాసుకొచ్చాడు.

ఐపీఎల్ 2018 వేలంలో రాజస్థాన్​ రాయల్స్ జోప్రా ఆర్చర్‌ను ఎక్కువ మొత్తం వెచ్చించి దక్కించుకుంది. బిగ్​బాష్ సహా కొన్ని లీగ్​ల్లో ఆర్చర్ అద్భుతంగా రాణించడంతో అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 2018 జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆర్చర్​ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2019 మేలో అతడు అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఏకంగా ప్రపంచకప్ ఆడాడు.

జార్జ్ ఫ్లాయిడ్ మృతికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. తాజాగా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ భర్త, ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ 'రెడిట్'‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాత్యహంకారానికి నిరసనగా.. 15 సంవత్సరాల క్రితం స్థాపించిన 'రెడిట్' సంస్థ పదవి నుంచి ఒహానియాన్ శుక్రవారం వైదొలగారు. అమెరికన్‌ వ్యాపార దిగ్గజం తన స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరారు.

Story first published: Saturday, June 6, 2020, 17:34 [IST]
Other articles published on Jun 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X