న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సుల వర్షం, పొలార్డ్‌పై విరుచుకుపడ్డ బ్రావో

Spectacular Darren Bravo show takes Trinbago to victory

ముంబై: బ్రావో.. అంటేనే జోరు హుషారు. మైదానంలో ఉన్న సమయంలో వికెట్ తీసినప్పుడో.. సిక్సులు కొట్టినప్పుడో డ్యాన్స్‌లతోనూ స్టెప్పులతోనూ ఆకట్టుకునే మరోసారి విజృంభించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ క్రికెట్ లీగ్‌లో డారెన్ బ్రావో విధ్వంసం సృష్టించాడు. 10 సిక్స్‌లు, 6 ఫోర్లు బాదిన బ్రావో.. 36 బంతుల్లోనే 94 పరుగులు పిండుకున్నాడు. ముఖ్యంగా.. కీరన్ పోలార్డ్ వేసిన ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదడంతోపాటు ఆ ఓవర్లలో 32 పరుగులు రాబట్టాడు.

200 పరుగులకు పైగా లక్ష్యంతో బరిలో దిగిన ట్రింబాగో జట్టు 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ బ్రెండన్ మెక్‌కల్లమ్ (42 బంతుల్లో 68), డారెన్ బ్రావో (36 బంతుల్లో 94 నాటౌట్) దూకుడుగా ఆడారు. పోలార్డ్ విసరిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్‌లు బాదిన బ్రావో.. మరుసటి బంతికి రెండు పరుగులు చేయడంతోపాటు ఆఖరి బంతిని కూడా సిక్స్‌గా మలిచాడు. కార్న్‌వాల్ బౌలింగ్‌లోనూ నాలుగు సిక్స్‌లు బాది జట్టును విజయపథంలో నడిపించాడు.

బ్రావో విధ్వంసంతో సెయింట్ లూసియా స్టార్స్‌పై ట్రింబాగో నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జట్టు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 72 పరుగులు చేయగా.. రహఖీం కార్నివాల్ (29 బంతుల్లో 53 నాటౌట్), కీరన్ పొలార్డ్ (23 బంతుల్లో 65 నాటౌట్) దూకుడుగా దండుకున్నారు.

ఈ మ్యాచ్‌లో మొత్తంగా 34 సిక్స్‌లు నమోదు కావడం గమనార్హం. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా సెయింట్ లూసియా స్టార్స్‌ (16 సిక్సులు), ట్రింబాగో నైట్ రైడర్స్ (18 సిక్సులు) మ్యాచ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2016 డిసెంబర్లో న్యూజిలాండ్‌లోని సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, ఒటాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ 34 సిక్స్‌లు నమోదైయ్యాయి.

Story first published: Friday, August 17, 2018, 14:43 [IST]
Other articles published on Aug 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X