న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 క్రికెట్‌ చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దలు (వీడియో)

South African spinner Colin Ackermann Records Best Bowling Figures In T20 Cricket

లీసెస్టర్‌: టీ20 క్రికెట్‌ చరిత్రలో ప్రపంచ రికార్డు బద్దలు అయింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్‌, లీసెస్టర్‌ షైర్‌ కెప్టెన్‌ కొలిన్‌ అక్రమాన్‌ (28) ఒక టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్లు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. విటాలిటీ బ్లాస్‌ టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం లీసెస్టర్‌ షైర్‌, వార్విక్‌షైర్‌ జరిగిన మ్యాచ్‌లో కొలిన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో 18 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి కొత్త టీ20 ప్రపంచ రికార్డును సాధించాడు. దీంతో 2011లో గ్లామోర్గాన్‌ జట్టుపై సోమెర్‌సెట్ తరఫున 6/5 సాధించిన మలేషియా బౌలర్ అరుల్ సుప్పయ్య ప్రపంచ రికార్డును అక్రమాన్‌ బద్దలు కొట్టాడు.

<strong>'సిడెల్‌ బౌలింగ్‌ చూస్తుంటే మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు'</strong>'సిడెల్‌ బౌలింగ్‌ చూస్తుంటే మెక్‌గ్రాత్‌ గుర్తుకు వస్తున్నాడు'

రెండు ఓవర్లలో ఆరు వికెట్లు:

ఈ మ్యాచ్ ముందు వరకు ఒక టీ20 మ్యాచ్‌లో ఆరు వికెట్లు అత్యధికం కాగా.. అక్రమాన్‌ ఆ రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. వార్విక్‌షైర్‌ జట్టులోని మైకేల్‌ బర్గెస్‌, సామ్‌ హైన్‌, విల్‌ రోడ్స్‌, లియామ్‌ బ్యాంక్స్‌, అలెక్స్‌ థామ్సన్‌, హెన్రీ బ్రూక్స్‌, జీతన్‌ పటేల్‌ వికెట్లను అక్రమాన్‌ తీసాడు. అక్రమాన్‌ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు తీసాడు. అక్రమాన్‌ దెబ్బకు 20 పరుగుల వ్యవధిలో వార్విక్‌ షైర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయింది.

 స్పిన్‌ మాయాజాలం:

స్పిన్‌ మాయాజాలం:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన లీసెస్టర్‌ షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. హరీ స్విండెల్స్‌ (63), లూయిస్‌ హిల్‌ (58)లు అర్ధ సెంచరీలు సాధించారు. 190 పరుగుల లక్ష్య ఛేదనలో వార్విక్‌ షైర్‌ 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సామ్‌ హైన్‌ (61), ఆడమ్‌ హోస్‌ (34)లు అద్భుతంగా ఆడి మూడో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో అక్రమాన్‌ తన బౌలింగ్‌ ప్రతాపం చూపించాడు. అక్రమాన్‌ స్పిన్ దెబ్బకు వార్విక్‌షైర్‌ 17.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయి 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.

భారత్‌ vs వెస్టిండీస్‌.. తొలి వన్డేకి వర్షం ముప్పు

ప్రపంచ రికార్డు సృష్టిస్తాననుకోలేదు:

ప్రపంచ రికార్డు సృష్టిస్తాననుకోలేదు:

మ్యాచ్ అనంతరం లీసెస్టర్‌ షైర్‌ కెప్టెన్‌ కొలిన్‌ అక్రమాన్‌ మాట్లాడుతూ... 'నిజంగా నేను నమ్మలేకపోతున్నా. ఈ ఆటను నేను చాలా కాలం గుర్తుంచుకుంటా. గ్రేస్ రోడ్లో బంతి ఇలా టర్న్ అవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటున్నా. నా ఎత్తును ఉపయోగించుకుని బంతిని బౌన్స్ చేయడానికి ప్రయత్నించా. బ్యాట్స్‌మన్‌ బంతిని మైదానంలోని ఫీల్డర్ల వైపుకు కొట్టాలని కోరుకున్నా. నేను బ్యాటింగ్ ఆల్ రౌండర్.. ప్రపంచ రికార్డు సృష్టిస్తానని అనుకోలేదు' అని అక్రమాన్‌ తెలిపాడు.

Story first published: Thursday, August 8, 2019, 13:24 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X