న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో విండిస్ ఏమాత్రం పోటీ ఇస్తుందో? గుయానాలో తొలి వన్డే సాధ్యమేనా?

India vs West Indies 2019, 1st ODI Match Can Be Delayed Due To Rain || Oneindia Telugu
India Vs West Indies 1st ODI: Match Can be Delayed Due to Rain, Weather Forecast of Guyana

గయానా: మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక ఇదే ఊపులో టీమిండియా వన్డే సమరానికి సిద్దమయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం ప్రావిడెన్స్‌ మైదానంలో వెస్టిండీస్‌, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. టీ20ల్లో కోహ్లీసేన ముందు నిలవలేకపోయిన విండీస్‌.. వన్డేల్లో ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.

<strong>చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!</strong>చాహల్‌ పాత్ర పోషించిన రోహిత్.. మరి చాహల్‌ ఏమన్నాడో తెలుసా!!

వర్షం ముప్పు:

వర్షం ముప్పు:

గురువారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే తొలి వన్డేకు వర్ష ముప్పు ఉందని సమాచారం తెలుస్తోంది. మ్యాచ్‌ ప్రారంభ సమయంలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం చిరుజల్లులు పడే అవకాశముందట. అయితే వర్షం కొద్దిసేపే కురుస్తుందని, తర్వాత వాతావరణం మెరుగవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే వర్షం కురిస్తే.. టాస్, మ్యాచ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

లక్ష్య ఛేదన కష్టమే:

లక్ష్య ఛేదన కష్టమే:

వర్షం పడితే తొలుత బౌలింగ్‌ చేసే జట్టుకు ఉపయోగపడనుంది. బౌలర్లు పిచ్‌పై ఉన్న తడిని ఉపయోగించుకుని స్వింగ్ రాబట్టే అవకాశం ఉంది. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్లు చెలరేగే అవకాశం ఉంది. అయితే మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ స్లోగా మారుతుంది. అదే సమయంలో లక్ష్య ఛేదన కూడా కష్టంగా మారుతుంది.

మిడిల్‌ ఆర్డర్‌ సమస్య:

మిడిల్‌ ఆర్డర్‌ సమస్య:

మిడిల్‌ ఆర్డర్‌ సమస్యకు పరిష్కారం కోసం కొత్త ఆటగాళ్లను ప్రయోగించేందుకు టీమిండియా సిద్ధమైంది. గాయంతో ప్రపంచకప్‌ నుంచి వైదొలగిన శిఖర్ ధావన్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. దీంతో కేఎల్‌ రాహుల్‌ నాలుగో స్థానంలో రానున్నాడు. ప్రపంచకప్‌లో ప్రభావం చూపలేకపోయిన కేదార్ జాదవ్ తుది జట్టులో ఉండే అవకాశాలు తక్కువ. మిడిల్‌ ఆర్డర్‌లో మనీశ్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ల్లో ఒకరికి ఛాన్స్‌ దక్కే అవకాశం ఉంది. టీ20లో పాండే నిరాశపరచడంతో అయ్యర్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వికెట్‌ కీపింగ్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ను పరిస్థితులకు తగ్గట్టు 5 లేదా 6స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపవచ్చు.

సూపర్ స్పెల్.. రికార్డు సృష్టించిన దీపక్‌ చాహర్‌

సైనీ అరంగేట్రం?:

సైనీ అరంగేట్రం?:

స్పిన్‌ బౌలింగ్‌లో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా జడేజా ఖాయం. దీంతో చాహల్‌, కుల్‌దీప్‌లలో ఒక్కరికే అవకాశం దక్కొచ్చు. ఇక టీ20 సిరీస్‌లో అదరగొట్టిన నవదీప్ సైనీ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. పేస్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్‌ కుమార్, మహ్మద్‌ షమీ, నవదీప్ సైనీ ఆడనున్నారు.

https://www.mykhel.com/photos/india-tour-of-west-indies-2019-images-251/#photos-2
Story first published: Thursday, August 8, 2019, 14:53 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X