న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా సఫారీ మాజీ ఆటగాడు

By Nageshwara Rao
South African Lance Klusener Named Consultant Coach of Delhi Ranji Team

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ ఢిల్లీ రంజీ జట్టుకు కన్సల్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం అధికారిక ప్రకటన చేసింది.

డీడీసీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ మాట్లాడుతూ "ఢిల్లీ రంజీ జట్టు క్రికెట్ కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే టోర్నమెంట్‌తో సహా ఫిబ్రవరి 2019లో ప్రారంభమయ్యే దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కి కోచ్‌గా వ్యవహారిస్తారు" అని తెలిపారు.

మాజీ ఢిల్లీ కెప్టెన్ మిథున్ మన్హాస్ ప్రస్తుతం ఢిల్లీ రంజీ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నారు. దీంతో లాన్స్ క్లూసెనర్‌ను కన్సల్టెంట్‌ కోచ్‌గా నియమించారు. దేశవాళీ క్రికెట్‌లో ఓ రంజీ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆనుభవం కోచ్‌ని నియమించడం ఇదే మొదటిసారి.

క్లూసెనర్ దక్షిణాఫ్రికా జట్టు తరుపున 171 వన్డేలాడి 3576 పరుగులు చేశాడు. వన్డే స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన క్లూసెనర్ మొత్తం 192 వికెట్లు తీసుకున్నాడు. 1999 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో క్లూసెనర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డుని సైతం దక్కించుకున్నాడు.

ఇక, 49 టెస్టులాడిన క్లూసెనర్ 1906 పరుగులతో పాటు 80 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో క్లూసెనర్ అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 64/8 కాగా, నాలుగు సెంచరీలు కూడా చేశాడు.

Story first published: Thursday, October 25, 2018, 15:25 [IST]
Other articles published on Oct 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X