న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెళ్లితో ఒకటైన మరో మహిళా క్రికెటర్ల ద్వయం

South Africa womens cricket team captain Dane van Niekerk marries all-rounder Marizanne Kapp

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్టు అగ్రశ్రేణి క్రీడాకారిణిలిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జట్టు కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్, పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ మరిజాన్‌ కాప్‌ శనివారం పెళ్లి చేసుకున్నారు. సఫారీ దేశంలో ఇద్దరు మహిళల వివాహంపై ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. 2009 వరల్డ్‌ కప్‌ టోర్నీలో వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. 2017-18 సంవత్సరానికి దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్‌ అవార్డు అందుకున్న నికెర్క్, ఇప్పుడు ఆ దేశం తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతోంది.

కాప్‌ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. వీరిద్దరు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా టాప్‌-10లో ఉన్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌లో కూడా సిడ్నీ సిక్సర్స్‌ తరఫున కలిసి ఆడిన నికెర్క్, కాప్‌... దక్షిణాఫ్రికాలో బాలుర అకాడమీలో శిక్షణ పొందిన తొలి ఇద్దరు అమ్మాయిలుగా కూడా గుర్తింపు పొందారు. ఇద్దరు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ఇది రెండోసారి. గత ఏడాది న్యూజిలాండ్‌కు చెందిన అమీ సాటర్‌వైట్‌ను సహచరి లియా తహుహు కలిసి వివాహం చేసుకున్నారు.

💍

A post shared by Marizanne Kapp (@kappie777) on

న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్ల అయిన సత్తర్ వైట్, లియా తహుహులు 2017వ సంవత్సరంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇలా భార్యాభర్తలుగా ఉండటంలో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఏదైతే జట్టులో సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో అలానే అనిపిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఒకానొక సందర్భంలో సత్తర్‌వైట్ మాట్లాడుతూ.. అంతకుముందు కంటే ఇప్పుడు న్యూజిలాండ్ జట్టు తరపున మేము బాగా ఆడుతున్నాం. ఈ ఆటతీరును ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు.

తహుహు మాట్లాడుతూ.. ఇలా వివాహమాడడం వల్ల ప్రొఫెషనల్‌గా మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బందులైతే రాలేదు. మేం చక్కగా కలిసే ప్రాక్టీసులో పాల్గొంటాం. కలిసే మ్యాచ్ ఆడి గెలుస్తాం. అని తెలిపారు. కాగా, వీరిద్దరి మద్య వయస్సు వ్యత్యాసం నాలుగేళ్లు ఉన్నప్పటికీ అది పెద్ద తేడాగా అనిపించదట.

Story first published: Monday, July 9, 2018, 14:27 [IST]
Other articles published on Jul 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X