మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అదే: ఆమ్లాని రనౌట్ చేసిన పాండ్యా

Posted By:
Ind vs SA 5th ODI : Hashim Amla Run Out by Hardik Pandya
South Africa vs India 2018: Hardik Pandya's direct hit to run out Hashim Amla is SK Turning Point of the match

హైదరాబాద్: పోర్ట్‌ ఎలిజబెత్‌‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులు చేసి ఆలౌటైంది. అయితే, ఈ మ్యాచ్ విజయానికి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాయే కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెరిసిన పాండ్యా

అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెరిసిన పాండ్యా

సఫారీ పర్యటనలో తొలి టెస్టులో బ్యాట్‌తో మెరిసిన పాండ్యా ఆ తరువాత చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌ ఆడలేదు. ఆరు వన్డేల సిరిస్‌లో కూడా అటు బౌలింగ్‌తో పాటు ఇటూ బ్యాటింగ్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. అయితే మంగళవారం జరిగిన ఐదో వన్డేలో బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన పాండ్యా అద్భుతమైన ఫీల్డింగ్‌తో మెరిశాడు. హాఫ్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన ఆమ్లా.. సఫారీ జట్టుని విజయపథంలో నడిపిస్తోన్న వేళ హార్దిక్ పాండ్యా అద్భుతం చేశాడు.

డైరెక్ట్ త్రో విసిరి ఆమ్లా(71)ను రనౌట్ చేసిన పాండ్యా

తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో డైరెక్ట్ త్రో విసిరి ఆమ్లా(71)ను రనౌట్ చేశాడు. దీంతో ఐదో వన్డేలో భారత్ విజయం మరింత సులువైంది. భువనేశ్వర్‌ వేసిన 35 ఓవర్‌ రెండో బంతికి ఆమ్లా మిడాఫ్‌ దిశగా ఆడి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. ఆ పాయింట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పాండ్యా బంతి వికెట్లకు తాకి బెయిల్స్ ఎగిరి లైట్లు వెలిగిన మిల్లీ సెకన్ల వ్యవధిలోనే ఆమ్లా బ్యాట్‌ను క్రీజులో ఉంచాడు.

ఆమ్లాను ఔట్‌గా ప్రకటించి థర్డ్ అంఫైర్

ఆమ్లాను ఔట్‌గా ప్రకటించి థర్డ్ అంఫైర్

అదృష్టం ఈసారి భారత్‌ను వరించడంతో.. బెయిల్స్ గాల్లోకి లేచే సమయానికి బ్యాట్ అంచు మాత్రమే క్రీజు గీతపై ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించిన అంపైర్‌ ఆమ్లాను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఆమ్లా పెవిలియన్‌ చేరాడు. భారత ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. అంతకు ముందు రహానే క్యాచ్ జారవిడచడం, అంపైర్ తప్పిదం కారణంగా రెండుసార్లు జీవదానం పొందిన ఆమ్లా 71 పరుగుల వద్ద రనౌటయ్యాడు.

సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

సఫారీ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

ఆ మరుసటి ఓవర్లో కుల్దీప్ పెహ్లుక్వాయోను పెవిలియన్ చేర్చడంతో భారత్ మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆమ్లా అవుట్‌ కాకుంటే భారత్‌ విజయానికి చాలా కష్టమయ్యేదని, పాండ్యా సూపర్‌ ఫీల్డింగే మ్యాచ్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సపారీ గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక సిరిస్‌ను గెలిచిన జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. తాజా విజయంతో ఆరు వన్డేల సిరిస్‌ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Wednesday, February 14, 2018, 10:59 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి