న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫిలాండర్‌పై అశ్లీల పదజాలం.. బట్లర్‌కు జరిమానా!!

South Africa vs England: Jos Buttler fined 15 percent match fee for verbally abusing Vernon Philander

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ వెర్నాన్ ఫిలాండర్‌పై అశ్లీల పదజాలం ప్రయోగించిన ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. ఫిలాండర్‌ను ఉద్దేశిస్తూ బట్లర్ బూతులు తిట్టడం స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డవడంతో.. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. అంతేకాదు బట్లర్‌ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చారు.

వారసత్వ వాచ్‌ను విమానంలో పోగొట్టుకున్న పాక్ దిగ్గజం!!వారసత్వ వాచ్‌ను విమానంలో పోగొట్టుకున్న పాక్ దిగ్గజం!!

438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. మరో 19 ఓవర్లు ఆడితే దక్షిణాఫ్రికా ఓటమి నుండి గట్టెక్కుతుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ విజయానికి 3 వికెట్లు అవసరం. తన జట్టును ఆదుకునేందుకు ఫిలాండర్‌ ప్రయత్నం చేస్తున్నాడు.

అప్పటికే ఫిలాండర్‌ 51 బంతులు ఆడి 8 పరుగులు చేశాడు. ఫిలాండర్‌ క్రీజులో పాతుకుపోవడంతో.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లలో అసహనం పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో ఇంగ్లీష్ బౌలర్‌ వేసిన ఓ బంతిని ఫిలాండర్‌ బ్యాటుతో డిఫెండ్‌ చేశాడు. బంతిని అందుకున్న జో రూట్‌.. కీపర్‌వైపు విసిరాడు. వికెట్ల వద్ద నిలబడ్డ ఫిలాండర్‌.. బంతిని గమనించలేదు. ఇదే అదునుగా భావించిన బట్లర్‌.. అశ్లీల పదజాలం వాడాడు. రాయలేనివి సైతం అన్నాడు.

బట్లర్‌ అశ్లీల మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డవడంతో మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. మైదానంలో క్రమశిక్షణను ఉల్లంగించిన కారణంగా.. బట్లర్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు. మరోవైపు అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చారు. ఏ క్రికెటర్ ఖాతాలో అయినా 24 నెలలో 4 డీమెరిట్ పాయింట్లు చేరితే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల్లో నిషేధం పడుతుంది. బట్లర్‌ ఖాతాలో డీమెరిట్ పాయింట్ చేరడం ఇదే తొలిసారి.

బట్లర్‌ అశ్లీల పదజాలంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన అభిమానులు, క్రికెటర్లు బట్లర్‌పై మండిపడ్డారు. మ్యాచ్ జరుగుతుండగానే వ్యాఖ్యాతలు ఇంగ్లాండ్‌ క్రికెటర్లను విమర్శించారు. 'వీడియోలో చాలా స్పష్టంగా, పెద్దగా వినిపిస్తోంది' అని పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ ట్వీట్‌ చేశాడు. భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే 'దయనీయం' అంటూ ట్వీట్ చేసాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (3/35) బౌలింగ్‌లోనూ సత్తాచాటడంతో.. దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది.

Story first published: Friday, January 10, 2020, 15:35 [IST]
Other articles published on Jan 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X