న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆండర్సన్ అరుదైన రికార్డు.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి బౌలర్!!

South Africa vs England: James Anderson Becomes First Fast Bowler to Play 150 Tests

సెంచూరియన్‌: ఇంగ్లాండ్‌ పేస్ బౌలర్ 'స్వింగ్ కింగ్' జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. సెంచూరియన్‌ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ అండర్సన్‌కు 150వది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు.

ఆసియా ఎలెవన్ జట్టులో పాక్ ఆటగాళ్లకు చోటు లేనట్టే?!!ఆసియా ఎలెవన్ జట్టులో పాక్ ఆటగాళ్లకు చోటు లేనట్టే?!!

ఆండర్సన్ @ 150:

ఆండర్సన్ @ 150:

షేన్ వార్న్ (145), ముత్తయ్య మురళీధరన్ (133), అనిల్ కుంబ్లే (132), గ్లెన్ మెక్‌గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 37 ఏళ్ల జేమ్స్‌ అండర్సన్‌ అందుకున్నాడు. ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడడం విశేషం. అండర్సన్‌ తన 150వ టెస్ట్ మ్యాచ్‌లో ఇప్పటికే ఒక వికెట్ తీసాడు. పేస్ బౌలర్లలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (135) రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ (132) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

 రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ:

రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ:

అండర్సన్‌ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 150 టెస్టులు ఆడిన రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (161) మాత్రమే అండర్సన్‌ కంటే ముందున్నాడు. ఇక క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే టెస్ట్ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (200) అగ్ర స్థానంలో ఉన్నాడు.

 సచిన్‌ @ 1

సచిన్‌ @ 1

అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో సచిన్‌ (200), రికీ పాంటింగ్‌ (168), స్టీవ్‌ వా (168), జాక్వస్ కలిస్ (166), శివ నరేన్ చంద్రపాల్‌ (164), రాహుల్‌ ద్రవిడ్‌ (164), అలిస్టర్ కుక్‌ (161), అలెన్ బోర్డర్ (156)లు వరుసగా ఉన్నారు. ఇంగ్లాండ్‌ తరఫున అండర్సన్‌ ఇప్పటివరకు 150 టెస్టులు ఆడి 576 వికెట్లు తీసాడు.

 నాలుగు నెలల విరామం:

నాలుగు నెలల విరామం:

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత ఆండర్సన్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఆగస్టులో ఆస్ట్రేలియాతో చివరిగా టెస్టు ఆడాడు. విరామం తర్వాత తిరిగి జట్టులోకి చేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని జిమ్మీ తెలిపాడు. 'చాలా కాలం తర్వాత క్రికెట్‌ ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. దాదాపు నాలుగు నెలల నుంచి క్రికెట్‌ ఆడలేదు. నా లయను తిరిగి అందిపుచ్చుకోవాలని భావిస్తున్నా' అని తెలిపాడు.

29 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన:

29 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన:

ఇంగ్లాండ్‌ తరఫున అండర్సన్‌ ఇప్పటివరకు 149 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 575 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు, టీ20ల్లో 18 వికెట్లు తీసాడు. మొత్తంగా 5 వికెట్లు 29 సార్లు తీసాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 27 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది.

Story first published: Thursday, December 26, 2019, 16:19 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X