న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో వార్మప్ టెస్ట్ మ్యాచ్.. ఓపెనర్‌గా రోహిత్ శర్మ

IND V SA,1st Test : Rohit Sharma,Umesh Yadav In Focus As Board Presidents XI Take On South Africa
South Africa vs Board Presidents XI: All eyes on Rohit Sharma as Test openar


వైజాగ్:
మూడు టీ20లు, మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో మూడు టీ20ల సిరిస్ 1-1తో ముగిసింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. ఇక ఇరు జట్ల మధ్య వచ్చే నెల 2 నుండి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు సాగరతీరం విశాఖపట్నం ఆతిథ్యమిస్తోంది. అయితే టెస్ట్ సమరానికి ముందు దక్షిణాఫ్రికా జట్టు గురువారం నుంచి బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది.

జిమ్‌లో తీవ్ర కసరత్తులు.. 4 నెలల్లో 26 కేజీలు తగ్గిన సానియా.. హీరోయిన్లకు పోటీ(వీడియో)జిమ్‌లో తీవ్ర కసరత్తులు.. 4 నెలల్లో 26 కేజీలు తగ్గిన సానియా.. హీరోయిన్లకు పోటీ(వీడియో)

దక్షిణాఫ్రికా, బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌ జట్ల మధ్య ఈ రోజు ఉదయం మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ప్రారంభం అయింది. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌‌ జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్నాడు. అంతేకాదు పరిమిత ఓవర్ల ఓపెనర్ అయిన రోహిత్ శర్మ.. ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. మొదటి టెస్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ స్థానంలో అగర్వాల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేయనున్నాడు కాబట్టి.. ఈ మ్యాచ్ అతనికి ఎంతో కీలకం. ఈ వార్మప్ మ్యాచ్‌లో పరుగులు చేస్తేనే జట్టు యాజమాన్యం అతనిపై పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకుండా ఉంటుంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి రోహిత్‌పైనే ఉంటుంది.

అంజిక్య రహానె, హనుమ విహారీ వెస్టిండీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో తమ మిడిల్ ఆర్డర్ స్థానాలను పదిలం చేసుకున్నారు. దీంతో రోహిత్‌కు మిగిలి ఉన్న ఏకైక ఆప్షన్ ఓపెనింగ్ చేయడమే. రాహుల్ విఫలమవడం, మాజీల మద్దతు ఉండడంతో రోహిత్ టెస్ట్ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 27 మ్యాచులు ఆడిన రోహిత్‌ 39.62 సగటుతో 1585 పరుగులు చేసాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరి ఓపెనర్‌గా రోహిత్ ఈమేరకు రాణిస్తాడో చూడాలి.

మరోవైపు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా స్థానంలో మరో పేసర్ ఉమేశ్ యాదవ్‌కు సెలక్టర్లు చోటు కల్పించింది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

Board President's XI:
Rohit Sharma (Captain), Mayank Agarwal, Priyank Panchal, AR Easwaran, Karun Nair, Siddhesh Lad, KS Bharat (wicket-keeper), Jalaj Saxena, Dharmendrasinh Jadeja, Avesh Khan, Ishan Porel, Shardul Thakur, Umesh Yadav.

Story first published: Wednesday, September 25, 2019, 14:12 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X