డైవ్‌ చేసి మరీ ఒడిసిపట్టుకున్నాడు: ఎల్గర్ అద్భుత క్యాచ్‌ని చూశారా? (వీడియో)

Posted By:
డైవ్‌ చేసి మరీ ఒడిసిపట్టుకున్నాడు: ఎల్గర్ అద్భుత క్యాచ్‌ని చూశారా?
South Africas Dean Elgar takes spectacular catch against Australia in fourth Test

హైదరాబాద్: జోహెన్స్ బర్గ్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్ డీన్ ఎల్గర్ పట్టిన ఓ అద్భుతమైన క్యాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది.

అనంతరం మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ టిమ్‌ ఫైన్‌, పాట్‌ కమిన్స్‌ దూకుడుగా ఆడుతూ జట్టుని ముందుండి నడిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాట్‌ కమిన్స్‌ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ 62వ ఓవర్‌లో మహరాజ్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

నిలకడగా స్కోరు బోర్డుని ముందుకు నడిపించిన పైనీ

నిలకడగా స్కోరు బోర్డుని ముందుకు నడిపించిన పైనీ

ఈ సమయంలో ఆస్ట్రేలియా 7 వికెట్లకు గాను 195 పరుగులు చేసింది. జట్టులోని సహచర ఆటగాళ్లు వెంటనే పెవిలియన్‌కు చేరుతున్నప్పటికీ... టిమ్ పైనీ మాత్రం నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. మరోవైపు టెయిలెండర్లు నాథన్‌ లియాన్‌(8), సయేర్స్ డకౌట్‌గా వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు.

62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీన్ ఎల్గర్‌కు క్యాచ్

62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీన్ ఎల్గర్‌కు క్యాచ్

చివరి వరకు పైనీ నిలకడగా ఆడాడు. అయితే, చివర్లో కగిసో రబాడ బౌలింగ్‌లో ఫైన్‌ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డీన్ ఎల్గర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రబాడ వేసిన బంతిని మిడ్ వికెట్ మీదుగా పైనీ ఆడటంతో అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న ఎల్గర్ బంతిని డైవ్‌ చేసి మరీ ఒడిసిపట్టుకున్నాడు.

కళ్లు చెదిరే వేగంతో అమాంతం గాల్లోకి ఎగిరాడు

కళ్లు చెదిరే వేగంతో అమాంతం గాల్లోకి ఎగిరాడు

దీంతో స్టేడియంలోని ప్రేక్షుకులు ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. నిజానికి ఎల్గర్ ఆ క్యాచ్‌ను పట్టుకుంటాడని ఎవరూ ఊహించలేదు. కానీ కళ్లు చెదిరే వేగంతో అమాంతం గాల్లోకి ఎగిరి మరీ బంతిని అందుకున్నాడు. ఇక అభిమానులు ఎల్గర్‌ క్యాచ్‌ అందుకున్న తీరును సోషల్ మీడియాలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే కుప్పకూలిన ఆసీస్

తమ జీవితంలో ఇలాంటి అద్భుత క్యాచ్‌ చూడలేదంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఇదే అత్యుత్తమ క్యాచ్‌ అంటూ ఎల్గర్‌ను కొనియాడుతున్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 221 పరుగులకే ఆలౌటైంది. అనంతరం మూడో రోజు ఆటను కొనసాగించిన సఫారీలు ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేశారు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 11:33 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి