న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డుప్లెసిస్‌ 185: 20 ఏళ్లైనా కిర్‌స్టెన్ రికార్డు చెక్కు చెదరలేదు

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌ 141 బంతుల్లో 16 ఫోర్లు, మూడు సిక్సులతో 185 పరుగులు సాధించడంతో శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయం సాధించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న డుప్లెసిస్‌ 141 బంతుల్లో 16 ఫోర్లు, మూడు సిక్సులతో 185 పరుగులు సాధించడంతో శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 4-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన నాలుగో వన్డేలో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున రెండో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన డుఫ్లెసిస్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు.

యూఏఈపై గ్యారీ కిర్‌స్టెన్‌ 188 నాటౌట్

యూఏఈపై గ్యారీ కిర్‌స్టెన్‌ 188 నాటౌట్

అంతకుముందు 1996 వన్డే వరల్డ్ కప్‌లో యూఏఈపై గ్యారీ కిర్‌స్టెన్‌ 188 (నాటౌట్‌) పరుగులు చేశాడు. 20 ఏళ్లు ముగిసినా సఫారీ మాజీ ఆటగాడు కిర్‌స్టెన్ రికార్డు మాత్రం చెక్కుచెదరకపోవడం గమనార్హం. అయితే తనకు డబుల్ సెంచరీ ఆలోచన గానీ, అత్యధిక స్కోరు సాధించాలనే ఆలోచన రాలేదని అన్నాడు.

సంతోషంగా ఉందన్న డుప్లెసిస్

సంతోషంగా ఉందన్న డుప్లెసిస్

అయితే 180 పరుగులు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నానని డుప్లెసిస్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన డుప్లెసిస్ టెస్ట్ కెప్టెన్సీ తనలో ఎంతో మార్పు తీసుకొచ్చిందని డుప్లెసిస్ అన్నాడు. వాస్తవానికి చివరి ఓవర్లో ఆడిన షాట్ ఫోర్ అయింటే కిర్‌స్టెన్ రికార్డును అధిగమించేవాడినని, అయితే దురదృష్టవశాత్తూ ఔటయ్యానని చెప్పాడు.

రెండో స్థానం దక్కినందుకు సంతోషం

రెండో స్థానం దక్కినందుకు సంతోషం

ఏది ఏమైతేనేం జట్టు విజయం సాధించిందని, కిర్‌స్టెన్ తర్వాత అత్యధిక వ్యక్తిగత స్కోరులో రెండో స్థానం దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు. ఇదే మ్యాచ్‌లో కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ (64), క్వింటన్‌ డికాక్‌ (55) అర్ధ సెంచరీలతో రాణించారు. కాగా, శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార, సచిత పతిరణ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా డుప్లెసిస్‌

‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా డుప్లెసిస్‌

368 పరుగుల భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన శ్రీలంక పార్నెల్‌ (4/58), ప్రిటోరియస్‌ (2/55), రబాడ (2/50), ఇమ్రాన్‌ తాహిర్‌ (2/76) దెబ్బకు 48.1 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ఉపుల్‌ తరంగ (119), నిరోషన్‌ డిక్‌వెల్లా (58), వీరక్కోడి (58) పోరాడినా ఓటమి తప్పలేదు. డుప్లెసిస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గా నిలిచాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య ఐదో వన్డే జరగనుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X