న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేల్ స్టెయిన్

South Africa paceman Dale Steyn retires from Test cricket

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడైన 36ఏళ్ల డేల్ స్టెయిన్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఊహించని షాకిచ్చాడు. 2004లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో స్టెయిన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఆర్టికల్ 370 రద్దు: ఇప్పుడు MSD అంటే మహేంద్ర సింగ్ ధోని కాదు!ఆర్టికల్ 370 రద్దు: ఇప్పుడు MSD అంటే మహేంద్ర సింగ్ ధోని కాదు!

దక్షిణాఫ్రికా తరుపున మొత్తం 93 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 3.24 ఎకానమీతో 439 వికెట్లు తీశారు. తన రిటైర్మెంట్ సందర్భంగా స్టెయిన్ "నాకు ఎంతో ఇష్టమైన ఒక క్రికెట్ ఫార్మాట్ నుంచి ఈ రోజు తప్పకుంటున్నాను. నా దృష్టిలో టెస్ట్ క్రికెటే అత్యుత్తమైంది. మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా అది మనల్ని పరీక్షిస్తుంది" అని అన్నాడు.

"మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడను అనే ఆలోచన వస్తేనే నాకు చాలా బాధగా ఉంది. ఇక నా కెరీర్‌ ముగిసేవరకూ వన్డేలు, టీ-20లపై దృష్టిసారిస్తాను. ఆట కోసం నా సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. దక్షిణాఫ్రితా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను" అని స్టెయిన్ పేర్కొన్నాడు.

యాషెస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం: తొలి టెస్టులో ఘన విజయంయాషెస్‌లో ఆస్ట్రేలియా శుభారంభం: తొలి టెస్టులో ఘన విజయం

అయితే, 2019-20 సీజన్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతాడని స్టెయిన్ పేర్కొన్నాడు. డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ సందర్భంగా అతడికి పలువురు ప్రస్తుత, మాజీలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

Story first published: Monday, August 5, 2019, 22:45 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X