సఫారీల లక్ష్యం 101: పోర్ట్ ఎలిజబెత్‌లో రబాడ అరుదైన ఘనత

Posted By:
South Africa lose Elgar in 101 chase after Rabada six-for

హైదరాబాద్: పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి జట్టుకు ముచ్చెమటలు పోయిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రబాడ... రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను స్వల్ప స్కోరుకే పరిమితం చేశాడు.

Australia vs South Africa 2018 2nd Test Score Card

తద్వారా రబాడ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఎక్కువ సార్లు 10 వికెట్లు తీసిన మూడో సఫారీ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు రబాడ నాలుగు సార్లు ఈ ఘనతను సాధించగా... డేల్ స్టెయిన్(5), ఎన్తీని(4)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. రబాడ కేవలం 28 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.

ఇదిలా ఉంటే రబాడ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 239 పరుగులకే ఆలౌటైంది. 180/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగోరోజైన సోమవారం ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 59 పరుగులకే మిగితా ఐదు వికెట్లను కోల్పోయింది. దీంతో ఆతిథ్య దక్షిణాఫ్రికాకు 101 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

101 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దక్షిణాఫ్రికా లంచ్‌ సమయానికి ఓ వికెట్‌ కోల్పోయి 22 పరుగులు చేసింది. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ సెంచరీతో రాణించడంతో 139 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, March 12, 2018, 16:40 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి