న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్: దక్షిణాఫ్రికా నిష్క్రమణకు నాలుగు ప్రధాన కారణాలివే!

ICC Cricket World Cup 2019 : Four Reasons Why South Africa Failed || Oneindia Telugu
 South Africa crash out of World Cup 2019: 4 reasons why they failed miserably

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లార్డ్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 49 పరుగులతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో సెమీస్‌ అవకాశాల్ని పూర్తిగా కోల్పోయి... లీగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసంవర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌ను సఫారీలు ఓటమితోనే ప్రారంభించారు. వరుసగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఇండియా చేతిలో ఓడిపోయారు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో పసికూన ఆప్ఘనిస్థాన్‌పై మాత్రమే విజయం సాధించారు. వెస్టిండిస్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.

ప్రపంచకప్‌కు ముందు అనేక పెద్ద జట్లపై అద్భుతమైన విజయాలను నమోదు చేసిన సఫారీలు అసలు సిసలైన మెగా టోర్నీలో మాత్రం చేతులెత్తేశారు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి గల కారణాలను ఒక్కసారి పరిశీలిద్దాం...

గాయాల బెడద

గాయాల బెడద

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను గాయాలు వేధించాయి. గాయం నుంచి కోలుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సఫారీ పేసర్ డేల్ స్టెయిన్‌కు గాయం తిరగబెట్టడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఈ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. డేల్ స్టెయిన్ దూరమవ్వడంతో డుప్లెసిస్ ప్లాన్-ఏ అమలు చేయడంలో విఫలమయ్యాడు. సఫారీ బౌలర్లు అంటేనే పేస్‌కు పెట్టింది పేరు. స్టెయిన్-లుంగి ఎంగిడి-కగిసో రాబడల త్రయంతో డుప్లెసిస్ తన ప్రత్యర్ధి జట్లకు చెక్ పెట్టచ్చని ఆలోచించాడు. అయితే, గాయంతో స్టెయిన్ టోర్నీకి దూరం కావడం.. ఆ తర్వాత లుంగి ఎంగిడి గాయపడటం ఇలా దక్షిణాఫ్రికా జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.

పేలవ ప్రదర్శన

పేలవ ప్రదర్శన

ఈ ప్రపంచకప్‌లో సఫారీ సెలక్టర్లు యువ క్రికెటర్లతో పాటు అనుభవానికి పెద్ద పీట వేశారు. అయితే, సీనియర్ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో రాణించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఓపెనర్ హషీమ్ ఆమ్లా ఈ ప్రపంచకప్‌లో ప్రభావం చూపలేకపోయాడు. అయితే, ఈ ప్రపంచకప్‌లో ఆమ్లా అందుకున్న రికార్డు ఏదైనా ఉందంటే అది వన్డేల్లో 8000 పరుగులు చేయడమే. వన్డేల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఆ తర్వాత జేపీ డుమిని, క్వింటన్ డీకాక్, డేవిడ్ మిల్లర్‌లు పూర్తిగా నిరాశపరిచారు.

చెత్త బ్యాటింగ్ & ఫీల్డింగ్

చెత్త బ్యాటింగ్ & ఫీల్డింగ్

ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ & ఫీల్డింగ్ పూర్తిగా నిరాశపరిచింది. ఈ ప్రపంచకప్‌లో ఏ ఒక్క సఫారీ క్రికెటర్ కూడా సెంచరీ సాధించలేదు. ఇక, బౌలింగ్‌లో సైతం పెద్దగా మెరుపులు మెరవలేదు. అంతేకాదు తమ చెత్త ఫీల్డింగ్‌తో భారీ మూల్యాలను చెల్లించుకున్నారు.

ఏబీ డివిలియర్స్

ఏబీ డివిలియర్స్

జట్టులో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. 35 ఏళ్ల డివిలియర్స్‌ క్రికెట్ ఆడగల సత్తా ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇంతవరకు ఆ జట్టుకు లభించలేదు. అనూహ్యంగా క్రికెట్‌కు ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలకడం అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ ప్రపంచకప్‌లో సఫారీల ప్రదర్శనను చూసిన ఏబీ డివిలియర్స్ ఈ వరల్డ్‌కప్‌ ముందు జట్టులో ఆడేందుకు తాను సుముఖంగా ఉన్నానని చెప్పినప్పటికీ... అతడి అభ్యర్ధనను జట్టు మేనేజ్‌మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు.

Story first published: Monday, June 24, 2019, 15:21 [IST]
Other articles published on Jun 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X