న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ganguly vs Kohli: ఇద్దరికీ అస్సలు పడటం లేదు! పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి..

Sourav Ganguly wanted to issue showcause notice to Virat Kohli over explosive comments in press conference

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీకి అస్సలు పడటం లేదా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అందుకే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీని వదులుకున్నాడని ప్రచారం జరుగుతుంది. సౌతాఫ్రికా పర్యటనకు ముందు విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యల పట్ల దాదా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని, బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాలో అతనికి షోకాజ్ నోటీసులు పంపించాలనుకున్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

జై షా వద్దనడంతో..

జై షా వద్దనడంతో..

అయితే షోకాజు నోటీసులు పంపేముందు సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జై షాకు తెలిపాడని, అతను ఈ విషయం పెద్దది కాకుండా గంగూలీని ఒప్పించాడని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఇక సౌరవ్ గంగూలీతో సంబంధాలు దెబ్బతినడంతోనే విరాట్‌ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలిగాడా అన్న ప్రశ్నలకు షోకాజు నోటీస్‌ అంశం బలాన్ని చేకూరుస్తోంది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్ ముందే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించగా... వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించింది.

వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో సౌతాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్‌గా, టెస్టులకు వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి సౌతాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

గంగూలీ మాటలకు విరుద్దంగా..

గంగూలీ మాటలకు విరుద్దంగా..

వన్డే కెప్టెన్సీ మార్పు విషయంలో స్పష్టమైన సమాచారం లేదని పేర్కొన్నాడు. ఇక టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవద్దని తాను స్వయంగా విరాట్ కోహ్లీని విజ్ఞప్తి చేసానని గంగూలీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. అలాంటిదేం జరగలేదని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ సూచించలేదన్నాడు. విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇక మూడు టెస్టుల సిరీస్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ గెలవగా, సౌతాఫ్రికా రెండు, మూడో మ్యాచ్‌ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది

 ద్రవిడ్‌తో పడక..

ద్రవిడ్‌తో పడక..

అయితే రెండో టెస్ట్‌కు విరాట్ కోహ్లీ వెన్నుగాయంతో తప్పుకున్నాడు. అయితే అతను కావాలనే తప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అంతేకాకుండా

మూడో టెస్టుకు జట్టును ఎంపిక చేయడంలో కూడా టీమ్‌మేనేజ్‌మెంట్‌తో కోహ్లీ విభేధాలు వచ్చినట్లు తెలిసింది. మూడో టెస్టుకు అజింక్య రహానేకు బదులుగా శ్రేయస్‌ అయ్యర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిసింది. కోచ్‌ ద్రవిడ్‌ మాత్రం రహానే వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడంతో కోహ్లీని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని, ఆ క్రమంలోనే టెస్ట్ కెప్టెన్సీ వదిలేసాడని సమాచారం.

Story first published: Friday, January 21, 2022, 14:50 [IST]
Other articles published on Jan 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X