న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్‌ ఇమడగలడా?: గంగూలీ అనుమానం

 Sourav Ganguly unsure how Rishabh Pant would fit into Indias World Cup squad

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసే భారత జట్టులో ఇమడగలడో లేదోనని మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. టీమిండియా భవిష్యత్‌కు పంత్ ఆశాకిరణమే అయినా.. తుది జట్టులో ఏ స్థానాన్ని కేటాయిస్తారని గంగూలీ ప్రశ్నించాడు.

గంగూలీ మట్లాడుతూ

గంగూలీ మట్లాడుతూ

శుక్రవారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మట్లాడుతూ "‘రిషబ్‌ పంత్‌ భారత జట్టు భవిష్యత్‌ తార అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రపంచకప్‌ జట్టులో అతను ఇమడకపోవచ్చని అనుకుంటున్నా. ఇప్పుడున్న కూర్పులో మాత్రం ఇది సాధ్యంకాదు. అతనికి వన్డేల్లో ఆడిన అనుభవం కూడా తక్కువే" అని అన్నాడు.

దినేశ్‌ కార్తీక్‌ ప్రస్తుత భారత వన్డే జట్టులో లేడు

దినేశ్‌ కార్తీక్‌ ప్రస్తుత భారత వన్డే జట్టులో లేడు

"దినేశ్‌ కార్తీక్‌ ప్రస్తుత భారత వన్డే జట్టులో లేడు. కాబట్టి అతన్ని ప్రత్యామ్నాయంగా పరిగణించరు. అంటే అతని గురించి సెలక్టర్లు ఆలోచించట్లేదు. దీంతో సెలెక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది" అని గంగూలీ అన్నాడు. మొత్తంగా వరల్డ్‌కప్ ముంగిట భారత జట్టు చాలా బలంగా ఉందని అతను అభిప్రాయపడ్డాడు.

కేఎల్ రాహుల్‌ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం

కేఎల్ రాహుల్‌ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం

"పేసర్లు బుమ్రా, భువీ, షమితో పాటు స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌తో వైవిధ్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో రాహుల్‌ ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌లు ఇంగ్లాండ్‌ గడ్డపై బాగా ఆడతాయి. దక్షిణాఫ్రికాపై మెరుగైన ప్రదర్శన చేసిన శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయకూడదు" అని గంగూలీ అన్నాడు.

Story first published: Saturday, March 2, 2019, 12:29 [IST]
Other articles published on Mar 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X