న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా : గంగూలీ

Sourav Ganguly shares heartfelt tribute for PK Banerjee

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ప్రదీప్ కుమార్‌ బెనర్జీ (83) మృతి పట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తనకి ఎంతో ప్రియమైన బెనర్జీని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ రోజు నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా. ఆయన పట్ల నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. నేను 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎంతో స్ఫూర్తినింపారు. ఆయనకు అపారమైన సానుకూల దృక్పథం ఉండేది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఈ వారంలో ఇద్దరు ప్రియమైన వ్యక్తులను కోల్పోయా'' అని దాదా ట్వీట్‌ చేశారు.

సచిన్, సాహా సంతాపం..

బెనర్జీ మృతి పట్ల టీమిండియా టెస్టు వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా సంతాపం తెలిపాడు. ఫుట్‌బాల్‌ లెజెండ్‌ బెనర్జీ మరణించినందుకు ఎంతో బాధగా ఉందని అన్నాడు. ఆయన భారత ఫుట్‌బాల్‌కు చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం బెనర్జీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఈ దిగ్గజ ప్లేయర్‌తో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఆయనతో దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు.

ఆసియా గేమ్స్‌లో స్వర్ణం ..

కొంత కాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న బెనర్జీ శుక్రవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించారు. భారత్‌ తరఫున 84 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన ఆయన 65 గోల్స్‌ సాధించారు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన కోచ్‌గా కూడా పనిచేశారు.

1936లో జననం..

1936లో జననం..

జూన్ 23, 1936లో పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి శివార్లలోని మొయినాగురిలో ప్రదీప్ కుమార్‌ బెనర్జీ జన్మించారు. కొంత కాలం తర్వాత జంషెడ్‌పూర్‌లోని తన మామయ్య స్థలానికి మకాం మార్చారు. బెనర్జీ 1960 రోమ్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించారు. కఠిన ప్రత్యర్థి ఫ్రెంచ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

2004లో ఫిఫా అవార్డు

2004లో ఫిఫా అవార్డు

అంతకుముందు 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 4-2 తేడాతో భారత్‌ విజయం సాధించడంలో బెనర్జీదే కీలక పాత్ర. భారతీయ ఫుట్‌బాల్‌కు బెనర్జీ చేసిన సేవలకుగానూ ప్రపంచ పాలక మండలి ఫిఫా గుర్తించి 2004లో సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేసింది.

Story first published: Friday, March 20, 2020, 21:42 [IST]
Other articles published on Mar 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X