న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫుట్‌బాలే నా జీవితం.. అనుకోకుండా క్రికెటర్‌నయ్యా: గంగూలీ

Sourav Ganguly says Everything will be back to normal once vaccines comes up

కోల్‌కతా: ఒకప్పుడు తనకు ఫుల్‌బాలే జీవితంగా ఉండేదని, ఆ తర్వాత అనుకోకుండా క్రికెటర్‌గా మారానని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిందని, ఒకసారి టీకా వచ్చిన తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని దాదా అభిప్రాయపడ్డారు. షెడ్యూల్‌లో కొన్ని మార్పులు జరిగినా.. క్రికెట్‌ పోటీలు ఇంతకుముందు లాగే జరుతాయని శనివారం ఓ యాప్‌ కోసం నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాస్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు.

రాత్రికి రాత్రే కెప్టెన్ కాలేదు.. నన్ను చాలా కాలం పరిశీలించారు: కోహ్లీరాత్రికి రాత్రే కెప్టెన్ కాలేదు.. నన్ను చాలా కాలం పరిశీలించారు: కోహ్లీ

ఖాళీగా ఉంటున్నానని

ఖాళీగా ఉంటున్నానని

సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'చిన్నతనంలో ఫుట్‌బాలే నా జీవితం. తొమ్మిదో తరగతి వరకూ అదే ఆడా. ఓసారి వేసవి సెలవుల్లో నేను ఇంట్లో ఖాళీగా ఉంటున్నానని మా నాన్న నన్ను క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. అత్యంత క్రమశిక్షణ పాటించే మా కుటుంబం నుంచి దూరంగా ఉండొచ్చనే ఉద్దేశంతో.. ఎంతో ఆనందంగా అకాడమీకి వెళ్లేవాణ్ని. అలా కొన్ని రోజులు సరదాగా గడిచాయి. కోచ్‌ నాలో ఏం గమనించాడో తెలీదు కానీ "మీ కొడుకును ఫుట్‌బాల్‌ మాన్పించి.. క్రికెట్లో కొనసాగేలా చూడండి" అని మా నాన్నకు చెప్పాడు' అని చెప్పాడు.

అన్నయ్య కిట్‌ తీసుకుని వెళ్లా

అన్నయ్య కిట్‌ తీసుకుని వెళ్లా

'ఓ రోజు బంగాల్‌ క్రికెట్‌ సంఘం ట్రయల్స్‌కి పిలిస్తే.. లెఫ్ట్‌హ్యాండరైన మా అన్నయ్య కిట్‌ తీసుకుని వెళ్లా. ట్రయల్స్‌లో బాగా ఆడా. ఆ తర్వాత ఏంజరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే అన్నయ్య కిట్‌ వాడడంతో నేను కూడా ఎడమ చేతి వాటం ఆటగాడిగా మారిపోయా' అని బీసీసీఐ బాస్ వెల్లడించాడు. భారత క్రికెట్‌ స్థాయిని పెంచిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2000 నుంచి 2005 వరకు గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలు రాళ్లను చేరుకుంది. అప్పటి మేటి జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. గంగూలీ భారత క్రికెట్‌ను మార్చిన గొప్ప ఆటగాడు. ఆయన కారణంగా భారత క్రికెట్‌కు ఎనలేని పేరు ప్రతిష్ఠలు వచ్చాయి.

వ్యాక్సిన్‌ వస్తే తిరిగి సాధారణ పరిస్థితులు

వ్యాక్సిన్‌ వస్తే తిరిగి సాధారణ పరిస్థితులు

కరోనా వల్ల గత కొన్ని నెలలుగా ప్రపంచం షాక్‌లో ఉందని, ఒక్కసారి వ్యాక్సిన్‌ వస్తే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గంగూలీ అంటున్నారు. 'వైరస్‌ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే మరో ఆరేడు నెలల కాలంలో వ్యాక్సిన్‌ వస్తే.. అంతా సాధారణంగా మారుతుంది. మనలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంది. క్రికెట్‌ కూడా మామూలు స్థితికి వస్తుందనుకుంటున్నా. క్రికెట్‌ను మళ్లీ సాధారణ స్థితికి తెచ్చేందుకు బీసీసీఐ, ఐసీసీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి' అని దాదా చెప్పారు. వ్యాక్సిన్‌ వస్తే జ్వరం, కామెర్లలాగే కరోనా వైరస్‌ కూడా ఉంటుందన్నారు.

Story first published: Sunday, May 31, 2020, 10:29 [IST]
Other articles published on May 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X