న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: ఈసారి టీవీ రేటింగ్స్‌ మరింత పెరుగుతాయి.. ఐపీఎల్‌ సూపర్‌ హిట్టే: గంగూలీ

Sourav Ganguly Says Broadcasters are expecting highest ratings for IPL 2020

పుణె: యూఏఈ వేదికగా త్వరలో మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు టెలివిజన్‌ రేటింగ్స్ ఈసారి మరింత పెరిగే అవకాశముందని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగే అవకాశముండటంతో చాలా మంది టెలివిజన్లలో చూసేందుకు ఆస్కారముందన్నారు. ఐపీఎల్‌ 2020 టెలివిజన్‌ రేటింగ్‌ రికార్డులను బద్దలు కొడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని, సాధారణ స్థితి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

టీవీ రేటింగ్స్‌ మరింత పెరుగుతాయి:

టీవీ రేటింగ్స్‌ మరింత పెరుగుతాయి:

సోమవారం ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2020 మ్యాచ్‌లను అభిమానులు టీవీల్లో కచ్చితంగా చూస్తారు. ఈ ఐపీఎల్‌ సీజన్‌ను అత్యధిక మంది వీక్షిస్తారని బ్రాడ్‌కాస్టర్లు అంచనా వేస్తున్నారు. మైదానాలను రాలేని క్రికెట్‌ ప్రేమికులు కచ్చితంగా టీవీలకు అతుక్కుపోతారని వారు భావిస్తున్నారు. ప్రతిదానిలోనూ ఏదో ఒక సానుకూలత ఉంటుంది. ఐపీఎల్‌ సూపర్‌ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది' అని ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కెరీర్‌లో దాదా 113 టెస్టుల్లో, 311 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

ఐపీఎల్‌ భాగమవుతుంది:

ఐపీఎల్‌ భాగమవుతుంది:

కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న ఈ క్లిష్ట సమయంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడంలో ఐపీఎల్‌ సైతం భాగమవుతుందని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. ఖాళీ స్టేడియాల్లో ఆడటంపై క్రికెటర్లు ఎలా ఫీలవుతున్నారని ఆయన్ను ప్రశ్నించగా... 'కరోనా వైరస్ సోకుతుందనే ప్రజలు దగ్గర దగ్గరగా ఉండటం లేదు. భౌతికదూరం పాటిస్తూ 30% మంది స్టేడియాల్లో కూర్చొనే రోజులు తప్పకుండా వస్తాయి. అయితే వారిని కట్టుదిట్టంగా పరీక్షించి లోపలికి పంపించాల్సి ఉంటుంది. అందుకు కాస్త సమయం పడుతుంది' అని ఆయన వెల్లడించారు.

ఐపీఎల్‌ను నిర్వహించకుండా ఉండొచ్చు కానీ:

ఐపీఎల్‌ను నిర్వహించకుండా ఉండొచ్చు కానీ:

'జీవితాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో ఐదారు నెలల్లో వైరస్ టీకాలు రావొచ్చు. అంతా యథాస్థితికి వచ్చేస్తుందన్న నమ్మకం ఉంది. ఇది కేవలం వైరస్‌. క్రమంగా బలహీన పడుతోంది. మనం దానిపై విజయం సాధించగలం. మనం ఐపీఎల్‌ను నిర్వహించకుండా ఉండొచ్చు. కానీ.. ఆ తర్వాత ఏంటి?. యుద్ధాలెన్నో వచ్చాయి.. వాటిని మనం దాటేశాం. ఇలాంటి ఉపద్రవాలూ అంతే. బుద్ధిని బట్టే ఏదైనా ఉంటుంది' అని సౌరవ్ గంగూలీ అన్నారు.

US Open: యుఎస్‌ ఓపెన్‌ షురూ.. కెర్బర్‌, ప్లిస్కోవా శుభారంభం!!

Story first published: Tuesday, September 1, 2020, 8:23 [IST]
Other articles published on Sep 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X