న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ ఆతిథ్యం మరువలేనిది: పాక్ పర్యటనపై బయోగ్రఫీలో గంగూలీ

By Nageshwara Rao
Sourav Ganguly recalls his pleasant experiences touring Pakistan

హైదరాబాద్: పాకిస్థాన్ ఆకర్షణీయమైన, ఎంతో అందమైన దేశమని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' పుస్తకంలో తన క్రికెట్ కెరీర్‌లో చోటు చేసుకున్న అనేక విషయాల్ని పలు ఇంటర్యూల్లో వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే.

సెహ్వాగ్ బ్యాటింగ్‌పై తన ఆటో బయోగ్రఫీలో గంగూలీ సంచలన వ్యాఖ్యలుసెహ్వాగ్ బ్యాటింగ్‌పై తన ఆటో బయోగ్రఫీలో గంగూలీ సంచలన వ్యాఖ్యలు

తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా కెప్టెన్‌గా పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన విషయాలను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా వేదికగా 2003లో వరల్డ్ కప్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ అనంతరం భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య అనేక ద్వైపాక్షిక సిరిస్‌లు జరిగాయి.

గంగూలీ సారథ్యంలోని టీమిండియా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఆ దేశ ప్రజలు జట్టుని ఆదరించిన తీరు అద్భుతమైని కొనియాడాడు. పాక్ పర్యటనలో తనకు మంచి జ్ఞాపకాలున్నాయని దాదా పేర్కొన్నాడు. 'పాక్ ఆకర్షణీయమైన దేశం, కఠినమైన, అందమైన దేశం. భిన్నంగా ఉంటుంది. అక్కడ మమ్మల్ని అంత బాగా ఆదరిస్తారని ఊహించలేదు... ఆహారం, ఆతిథ్యం, దయతో' అని అన్నాడు.

'ఇస్లామాబాద్ అందమైన ప్రదేశం. రాజధానికి వెళితే అక్కడ ఓకవైపు ఎత్తైన బిల్డింగ్‌లు మరోవైపు పాకిస్థాన్‌లోని అందమైన పర్వతాలను చూడొచ్చు. చాలా మనోహారంగా ఉంటాయి' అని గంగూలీ అన్నాడు. సియోల్కోట్‌లో ఏకైక వన్డే మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు.

మీ జీవితం రంగులమయంగా ఉండాలి: హ్యాపీ హోలీ అంటూ క్రికెటర్లుమీ జీవితం రంగులమయంగా ఉండాలి: హ్యాపీ హోలీ అంటూ క్రికెటర్లు

'సియోల్కోట్‌లో వన్డే మ్యాచ్ ఆడేందుకు వెళ్లిన సందర్భంగా ఇప్పటికీ నాకు గుర్తుంది. ఉదయం పూట అక్కడికి బయల్దేరాం. రోడ్డుకు ఇరువైపులా అక్కడి ప్రజలు మా కోసం ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్‌లో కఠిన ప్రదేశంగా దీనిని పిలుస్తారు. అయినా సరే సియోల్కోట్ అందంగా ఉంది. అక్కడ కూడా వారి ఆతిథ్యంతో మమ్మల్ని ఆదరించారు. పాకిస్తాన్ పర్యటనను నేను ఎంతగానో ఇష్టపడ్డా' అని గంగూలీ అందులో పేర్కొన్నాడు.

Story first published: Friday, March 2, 2018, 19:16 [IST]
Other articles published on Mar 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X