న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sourav Ganguly: మన కోహ్లీని కాదని.. ఆల్ టైం గ్రేట్ ప్లేయర్‌గా అతన్ని పేర్కొన్న దాదా..!

 Sourav Ganguly praises Joe Root as a All Time Great Player After Root remarkable century aginst newzealand

లార్డ్స్‌‌లో ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో జోరూట్ (115పరుగులు 170బంతుల్లో, 12ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మరో రోజు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ మీద 5వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. జోరూట్ కడవరకు క్రీజులో ఉండి సెంచరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో జోరూట్ ప్రదర్శన పట్ల ప్రశంసల జల్లు కురుస్తుంది. తాజాగా అతని ప్రదర్శన పట్ల బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా స్పందించాడు. 'జో రూట్ వాటే ప్లేయర్.. ప్రెషర్‌లో ఎంత అద్భుతంగా ఆడాడు. ఆల్ టైం గ్రేట్ ప్లేయర్' అంటూ గంగూలీ.. రూట్‌ను పొగిడాడు. టెస్ట్ క్రికెట్లో జో రూట్ ఎంత అద్భుతమైన ప్లేయరో తెలిసిందే. వర్ధమాన క్రికెటర్లలో ప్రస్తుతం జోరూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ గొప్ప టెస్ట్ క్రికెటర్లుగా కొనసాగుతుండగా.. గంగూలీ జో రూట్‌ను ఆల్ టైం గ్రేట్ ప్లేయర్‌గా కీర్తించడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో రూట్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో (అన్ని ఫార్మాట్లలో కలిసి) 17000పరుగుల మార్క్ చేరుకున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 118 మ్యాచ్‌లు ఆడిన రూట్ 26 సెంచరీలతో 10015పరుగులు చేయగా.. వన్డేల్లో 152 మ్యాచ్ లు ఆడిన రూట్ 16సెంచరీలతో 6109పరుగులు చేశాడు. ఇక పొట్టి ఫార్మాట్లో 32 మ్యాచ్‌లు ఆడిన రూట్ 5హాఫ్ సెంచరీలతో 893పరుగులు చేశాడు.

ఇకపోతే తొలి టెస్ట్ చాలా రసవత్తరంగా సాగింది. ఇక నాలుగో రోజు ఇంగ్లాండ్ విజయానికి 61పరుగులు, న్యూజిలాండ్ విజయానికి 4వికెట్లు కావాల్సిన తరుణంలో నాలుగో రోజు 216/5 స్కోరుతో బరిలోకి దిగిన జో రూట్ (77తో) ఏ దశలోనూ తన పట్టు సడలించలేదు. కడవరకు క్రీజులో ఉండి సెంచరీ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ బెన్ ఫోక్స్ ( 32పరుగులు 92బంతుల్లో 3ఫోర్లు) కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు 120పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ విజయదాహాన్ని తీర్చారు. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ (2021 - 23)లో ఇప్పటికే 13 మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌కు 14వ మ్యాచ్‌లో విజయంతో 2వ గెలుపు వల్ల ఒక స్థానం ఎగబాకి 8వ స్థానానికి చేరుకుంది. ఇక సిరీస్‌లో (1-0)తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో వచ్చింది. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్, కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ఆధ్వర్యంలో గెలుపుతో ఇంగ్లాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

Story first published: Monday, June 6, 2022, 8:26 [IST]
Other articles published on Jun 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X