న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాలుగు దేశాలతో 'వన్డే సూపర్ సిరిస్': గంగూలీపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ప్రశంసల వర్షం

Sourav Ganguly ‘ODI Super series’ finds support from Cricket Australia CEO

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీపై క్రికెట్ ఆస్టేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. గంగూలీ ప్రతిపాదించిన నాలుగు దేశాల 'వన్డే సూపర్ సిరిస్' ఆలోచన కొత్తగా ఉందని కొనియాడారు.

భారత్, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలతో పాటు మరో దేశం కలిపి 2021 నుంచి ప్రతి ఏటా నాలుగు దేశాల టోర్నీ ఆడాలని సౌరవ్ గంగూలీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ధ్రువీకరించిన సంగతి తెలిసిందే.

Asia XI vs World XI: బీసీసీఐ తన అక్కసుని వెళ్లగక్కిన పాక్ క్రికెట్ బోర్డుAsia XI vs World XI: బీసీసీఐ తన అక్కసుని వెళ్లగక్కిన పాక్ క్రికెట్ బోర్డు

ఐసీసీ ప్రణాళికను అమలు చేయకుండా

ఐసీసీ ప్రణాళికను అమలు చేయకుండా

ప్రతి క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నిర్వహించే గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించాలనే వారి ప్రణాళికను అమలు చేయకుండా నిరోధించడానికి ఇది ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో కెవిన్‌ రాబర్ట్స్‌ మాట్లాడుతూ "సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీసీఐ నుండి వెలువడిన ఓ వినూత్న ఆలోచనకు ఇది ఒక ఉదాహరణ" అని అన్నాడు.

అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన

అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన

"అధ్యక్షుడిగా అతడు పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చారిత్రక డే-టెస్టుని నిర్వహించాడు. అది మంచి ఫలితాలనిచ్చింది. ఇప్పుడు సూపర్ సిరీస్‌తో ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు. వచ్చే నెలలో భారత్, బంగ్లాదేశ్‌తో క్రికెట్‌ క్యాలెండర్‌ గురించి చర్చిస్తాం" అని అన్నాడు.

పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో కూడా మాట్లాడతాం

పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో కూడా మాట్లాడతాం

"అనంతరం పాకిస్థాన్, న్యూజిలాండ్‌లతో కూడా మాట్లాడతాం. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. ప్రపంచ క్రికెట్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాం. వచ్చే ఏడాది ఆప్ఘనిస్థాన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ప్రపంచ క్రికెట్‌పై మాకు ఉన్న గౌరవానికి ఇది ఉదాహరణ" అని కెవిన్ రాబర్ట్స్ చెప్పాడు.

క్రికెట్‌‌ను ఓ మతంలాగా

క్రికెట్‌‌ను ఓ మతంలాగా

"ఉపఖండంలో క్రికెట్‌‌ను ఓ మతంలాగా భావిస్తారు. భారత్, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల్లో క్రికెట్‌ అందరికీ ఫేవరేట్‌. అన్ని దేశాల్లోనూ క్రికెట్‌ అభివృద్ధి చెందుతుంది. కివీస్‌తో అనుబంధాన్ని మేము ప్రత్యేకంగా చూస్తాం. 2023-31 వరకు క్రికెట్‌ క్యాలెండర్‌ గురించి మేం చర్చించుకున్నాం" అని తెలిపాడు.

32 ఏళ్ల వరకు న్యూజిలాండ్‌ను

32 ఏళ్ల వరకు న్యూజిలాండ్‌ను

"అలాగే, మరో 32 ఏళ్ల వరకు న్యూజిలాండ్‌ను బాక్సింగ్‌ డే టెస్టుకు ఆహ్వానించాలని అనుకుంటున్నాం. ప్రపంచ క్రికెట్‌లో న్యూజిలాండ్ ముఖ్యమైన భాగస్వామి. బాక్సింగ్ డే టెస్టుకు 80,000 మందికి ఆతిథ్యం ఇవ్వగల వేదిక ఏదైనా ఉందంటే అది ఎంసీజీ మాత్రమే. ఇది కేవలం ఒక చిత్రం. ఇది మాకు నిజంగా ఓ గౌరవం" అని రాబర్ట్స్ అన్నాడు.

టెస్టులను నిర్వహించడానికి

టెస్టులను నిర్వహించడానికి

"ప్రపంచంలో టెస్టులను నిర్వహించడానికి మెల్‌బోర్న్‌, లార్డ్స్‌ మైదానాలు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచ క్రికెట్‌కు ఎంసిజి టెస్ట్ యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా, ఇది ఇక్కడ శాశ్వతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో బాక్సింగ్ డే టెస్టు నిర్వహించడానికి ఎంసీజీ ఉత్తమమని చెప్పాలి" అని ఆయన తెలిపారు.

Story first published: Friday, December 27, 2019, 17:29 [IST]
Other articles published on Dec 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X