న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్‌తో గంగూలీ భేటీ.. క్రికెట్‌ అకాడమీపై చర్చ

Sourav Ganguly meets Rahul Dravid to discuss roadmap to improve NCA

బెంగళూరు: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భేటీ అయ్యారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ద్రవిడ్‌తో దాదా బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. అకాడమీ పనితీరు, అభివృద్ధి అంశాలపై ఈ ఇద్దరు భారత మాజీ కెప్టెన్లు చర్చించారు.

<strong>T10 League: బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్‌.. ఢిల్లీ జట్టుకు ఆమె అందం!!</strong>T10 League: బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీ లియోన్‌.. ఢిల్లీ జట్టుకు ఆమె అందం!!

భవిష్య ప్రణాళికపై సమీక్ష

భవిష్య ప్రణాళికపై సమీక్ష

బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన ఎన్‌సీఏ, దాని అభివృద్ధి ప్రణాళికపై ద్రవిడ్‌, గంగూలీ దృష్టి సారించారు. ఇక జాతీయ క్రికెట్‌ అకాడమీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్‌ సమీక్షించారు. ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్ల పునరావాస శిబిరంగానే ఎన్‌సీఏ ఉపయోగపడుతోంది. ఈ తరుణంలో యువ ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో శిక్షణనిస్తూ రిజర్వ్‌ బెంచ్‌ను పటిష్ఠం చేయాలనుకుంటున్నారు.

ఎన్‌సీఏకు 40 ఎకరాలు

ఎన్‌సీఏకు 40 ఎకరాలు

సమావేశం తర్వాత అందరూ కలిసి నగరంలో కొత్తగా ఎన్‌సీఏను నిర్మించాల్సిన స్థలాన్ని పరిశీలించారు. అకాడమీ కోసం ఈ ఏడాది మేలో కర్ణాటక ప్రభుత్వం నుంచి 25 ఎకరాలకు ఒప్పందం కుదుర్చుకున్న బీసీసీఐ.. సెంటర్ ఫన్ ఎక్సలెన్స్ ఏర్పాటు కోసం మరో 15 ఎకరాల స్థలాన్ని తీసుకుంది. ప్రస్తుతం ఎన్‌సీఏకు 40 ఎకరాల స్థలం ఉంది.

అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏ

అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏ

ఈ 40 ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో, అధునాతన సౌకర్యాలతో ఎన్‌సీఏను నిర్మించాలని బీసీసీఐ భావిస్తోంది. మూడు మైదానాలు, ఇండోర్ నెట్‌లు, పరిపాలన భవనాలు, హాస్టళ్లు నిర్మించాలని బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి అనుబంధంగా ఎన్‌సీఏ నడుస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన వారం రోజుల్లోనే ఎన్నో పనులు చేసారు.

Story first published: Thursday, October 31, 2019, 10:39 [IST]
Other articles published on Oct 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X