న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంత సులభం కాదు: పాక్‌ను టోర్నీ నుంచి నిషేధించడంపై గంగూలీ

Sourav Ganguly explains why it will be difficult for BCCI to get Pakistan banned at ICC 2019 World Cup

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన వంతు ప్రయత్నాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ నుంచి పాక్‌ను నిషేధిస్తూ చర్యలు తీసుకోవడం అంత సులభం కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

<strong>పాక్‌ను ఒంటరిని చేయాలి: 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎలా దూరమైందో!</strong>పాక్‌ను ఒంటరిని చేయాలి: 20 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఎలా దూరమైందో!

ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో గంగూలీ మాట్లాడుతూ "వరల్డ్‌కప్‌ నుంచి లేదా ప్రపంచ క్రికెట్‌ నుంచి పాక్‌ను నిషేధించడం చాలా కష్టం. ఇది అమలు కావాలంటే చాలా పెద్ద కథే ఉంటుంది. అది అంత సులభం కాదు. ఐసీసీ అనేది ఒక ప్రత్యేకమైన క్రికెట్‌ మండలి. అందులోనూ ఐసీసీ నిర్వహించే వరల్డ్‌కప్‌ ఇంకా ప్రత్యేకం" అని గంగూలీ అన్నాడు.

పాక్‌ను నిషేధించాలనే కోరడం

పాక్‌ను నిషేధించాలనే కోరడం

"ఇక్కడ భారత ప్రభుత్వం కానీ బీసీసీఐ కానీ పాక్‌ను నిషేధించాలనే కోరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. పాక్‌తో మనం మ్యాచ్‌లు ఆడకుండా ఉండటమే సరైన నిర్ణయం. ఇప్పటికే పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆపేశాం. ఐసీసీ నిర్వహించే ఈవెంట్‌లో ఒక జట్టును రద్దు చేయడమనేది కష్టం" అని గంగూలీ తెలిపాడు.

పాక్ ఆటగాళ్లకు వీసాలు నిరాకరించిన భారత ప్రభుత్వం

పాక్ ఆటగాళ్లకు వీసాలు నిరాకరించిన భారత ప్రభుత్వం

"భారత్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్ వరల్డ్‌కప్‌లో పాక్ ఆటగాళ్లకు మన ప్రభుత్వం వీసాలు నిరాకరించింది. ఇది ఒక వివాదంగా మారింది. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) తీవ్రంగా స్పందించడం మనం చూశాం. నా అభిప్రాయం ప్రకారం ఒక దేశాన్ని వరల్డ్‌కప్‌ నుంచి రద్దు చేయడం సాధ్యం కాదు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ సభ్య దేశాలను కోరిన బీసీసీఐ

ఐసీసీ సభ్య దేశాలను కోరిన బీసీసీఐ

పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌లో పాక్‌తో భారత్‌ ఆడొద్దని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదానికి కొమ్ముకాస్తున్న దేశంతో సంబంధాలు తెంచుకోవాలని ఐసీసీ సభ్య దేశాలను బీసీసీఐ కోరింది.

ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ

ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ

వరల్డ్ కప్‌లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానుల సంక్షేమం, పటిష్ట భద్రత కోసం లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. అందులో ఐసీసీ వరల్డ్‌కప్‌ను వీక్షించేందుకు వచ్చే భారత అభిమానుల భద్రత, క్షేమం గురించీ బీసీసీఐ భయపడుతోంది. మైదానాల్లో ఆటగాళ్లు, మ్యాచ్‌ అధికారులు, అభిమానులకు ఐసీసీ, ఈసీబీ పటిష్ట భద్రత కల్పించాలని కోరింది. నిజానికి... పాక్‌ను వరల్డ్‌కప్ నుంచి తప్పించాల్సిందిగా ఐసీసీని కోరే ప్రతిపాదనను కూడా వినోద్ రాయ్ ముందుకు తీసుకొచ్చినా.. తర్వాత విరమించుకున్నారు.

Story first published: Monday, February 25, 2019, 18:14 [IST]
Other articles published on Feb 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X