న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడిని కూడా నొప్పించాను: చిన్నారికి స్టీవ్ స్మిత్ వ్యక్తిగత క్షమాపణ

By Nageshwara Rao
Sorry I made him upset: Disgraced Steve Smith issues a personal apology to Deborah Knight

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌‌కు పాల్పడి దేశం పరువు తీసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఓ చిన్నారి అభిమానికి వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సిడ్నీ విమానాశ్రయంలో నిర్వహించిన విమానాశ్రయంలో తాను నాయకుడిగా విఫలమయ్యానని, తనను క్షమించాల్సిందిగా కోరుతూ స్టీవ్ స్మిత్ కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. మీడియా సమావేశంలో స్మిత్ ఏడ్చిన సన్నివేశాన్ని చూసిన నైన్‌ న్యూస్‌ చానెల్‌ ప్రెజెంటర్‌ డెబోరా నైట్‌ కుమారుడు డార్సీ తీవ్ర వేదనకు లోనయ్యాడు.

తొమ్మిదేళ్ల డార్సీ... స్టీవ్ స్మిత్‌కు వీరాభిమాని. బాల్ టాంపరింగ్ వివాదంలో తాను పెద్ద తప్పు చేశానని, అందుకు తనను క్షమించాలని స్మిత్ బోరున విలపించడం డార్సీతో పాటు పలువురు అభిమానులను ఎంతగానో కలచివేసింది. దీంతో తన కొడుకును సముదాయించడానికి డెబోరాకు 20 నిమిషాలు పట్టింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ఆమె స్మిత్‌కు తెలియజేయగా.. స్మిత్ వెంటనే స్పందించాడు.

Sorry I made him upset: Disgraced Steve Smith issues a personal apology to Deborah Knight

'నా చర్యలతో అతడిని కూడా నొప్పించాను. మీ కుమారుడికి నా వ్యక్తిగత క్షమాపణలు తెలపండి' అని స్టీవ్‌ స్మిత్ స్పందించాడు. ఇదిలా ఉంటే బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్‌కు అనూహ్య మద్దతు లభిస్తోంది. బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సమయంలో స్మిత్‌పై తీవ్ర విమర్శలు చేసిన పత్రికలు ఇప్పుడు అదే స్మిత్‌కు సాంత్వన చేకూరేలా రాస్తున్నాయి.

'ప్రియమైన ఆస్ట్రేలియా.. ఇక చాలు' అన్న శీర్షికతో స్మిత్‌పై ఆ దేశ ప్రజల ఆగ్రహావేశాలను దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్‌ పేపర్‌ 'ద టైమ్స్‌' సూచించింది. అంతేకాదు 'ఇది బాల్‌ టాంపరింగే.. హత్య కాదు' అని స్మిత్‌పై, వార్నర్‌లకు విధించిన ఏడాది పాటు నిషేధంపై కూడా తీవ్రంగా మండిపడింది. సిడ్నీ విమానాశ్రయంలో స్టీవ్ స్మిత్ మీడియా సమావేశం ఎంతో మందిని చలించేలా చేసింది.

స్మిత్ ఏడవడాన్ని చూసిన పలువురు క్రికెటర్లు సైతం అతడికి మద్దతుగా నిలిచారు. 'స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌ మంచి వ్యక్తులు. బహుశా పిచ్చితనంతో అలా చేసివుండొచ్చు' అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అన్నాడు. 'లోకమంతా తీవ్రంగా స్పందించడంతో వారు చేసిన దానికంటే తప్పిదం పెద్దదిగా కనిపించింది. కానీ వారికి వేసిన శిక్షలు సరికాదేమో' అని ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు.

కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది.

ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది.

అయితే, ఆ తర్వాత క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, March 31, 2018, 11:31 [IST]
Other articles published on Mar 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X