న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియాకి ఆడుతున్న పాకిస్తాన్ క్రికెటర్ కొడుకు

Son of Pakistani Legend Abdul Qadir Wants to Play for Australia

హైదరాబాద్: స్వదేశం తరపున ఆడి జట్టును గెలిపించాలనే క్రికెటర్లు తరచుగా చూస్తూనే ఉంటాం. దేశమేదైనా అవకాశం వస్తే చాలని, తామేంటో నిరూపించుకోవాలని ఎదురుచూసే క్రికెటర్లు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకడే పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ ఖదీర్‌ తనయుడు ఉస్మాన్‌ ఖదీర్‌ ఆస్ట్రేలియా జట్టు తరపున బరిలోకి దిగాడు.

ఆస్ట్రేలియా జట్టులో భాగమవుతానని ధీమా

ఆస్ట్రేలియా జట్టులో భాగమవుతానని ధీమా

ఆస్ట్రేలియా జాతీయ జట్టులో ఆడేందుకు ఉవ్విళ్లూరుతోన్న ఉస్మాన్.. బుధవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వార్మప్‌ వన్డే మ్యాచ్‌లో పీఎం-11 జట్టు తరపున తొలిసారి ఆసీస్‌ జెర్సీ ధరించాడు. తన తండ్రిలానే లెగ్‌స్పిన్‌తో అదరగొట్టి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ యువ క్రికెటర్‌.. త్వరలోనే ఆస్ట్రేలియా జట్టులో భాగమవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

పాకిస్తాన్‌ వీడేందుకు కారణమిదే

పాకిస్తాన్‌ వీడేందుకు కారణమిదే

అయితే తానూ పాకిస్తాన్‌ వీడేందుకు కారణం కేవలం సరైన అవకాశాలు లభించకపోవడమేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతమున్న తాత్కాలిక వీసాతో ఆసీస్‌ దేశవాళీ జట్టులో రాణిస్తోన్న ఉస్మాన్‌.. త్వరలోనే ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది దేశం తరపున ఆడుతానని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు జట్టులో ఉండటమే తన లక్ష్యంగా చెప్పుకొచ్చాడు.

కెరీర్ కోసం తప్పలేదని అంటోన్న పాక్‌ క్రికెటర్‌

కెరీర్ కోసం తప్పలేదని అంటోన్న పాక్‌ క్రికెటర్‌

టీ20కు ముందే తనకు వన్డే, టెస్టుల్లో అవకాశం లభిస్తే అదృష్టంగా భావిస్తానని తెలిపాడు. ఈ నిర్ణయాన్ని తన తండ్రి ఖదీర్‌ అంత సులువుగా ఒప్పుకోలేదన్నాడు. కానీ, కెరీర్ కోసం తప్పలేదని అన్నాడు. ఇక పాక్‌ క్రికెటర్‌ ఆసీస్‌ తరపున ఆడటం ఇదే తొలిసారి కాదు. ఫవాద్‌ అహ్మద్‌ 2013లో ఆసీస్‌ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అదే బాటలో ఉస్మాన్‌ నడుస్తున్నాడు.

ఆసీస్‌కు వచ్చాకే నాకు అవకాశాలు

ఆసీస్‌కు వచ్చాకే నాకు అవకాశాలు

‘కొన్నేళ్ల క్రితం నా తండ్రితో నేను ఆస్ట్రేలియా తరపున ఆడాలనుకుంటున్నానని చెప్పాను. దీనికి ఆయన కుదురదు.. పాకిస్తాన్‌ తరుపునే ఆడాలని ఆదేశించాడు. కానీ నాకు పాక్‌ తరపున ఆడే అవకాశం అంతగా రాలేదు. జట్టులో ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాను. ఆసీస్‌కు వచ్చాకే నాకు అవకాశాలు దక్కాయి. దీంతో మా నాన్న కూడా ఒప్పుకున్నారు. నా దీవెనెలు నీకు ఎప్పుడుంటాయి. నీకేం కావాలో నీవు అది చెయ్యి' అని ఉస్మాన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, November 2, 2018, 12:18 [IST]
Other articles published on Nov 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X