న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాఫ్ సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన: తొలి వన్డేలో భారత్ విజయం

Smriti Mandhana, Bowlers Guide Indian Womens Team To Easy Win vs Sri Lanka in 1st ODI

హైదరాబాద్: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన 73 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లకే లక్ష్యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు భారత బౌలర్ల ధాటికి 35.1 ఓవర్లకే అలాటై 98 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక జట్టులో ఓపెనర్‌ జయంగణి (33) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగాత ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.

భారత బౌలర్లు జోషి 3, గోస్వామి, పూనమ్‌ యాదవ్‌ చెరో రెండు, గైక్వాడ్‌, దీప్తి శర్మ, హేమలత తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 99 పరుగుల విజయ లక్ష్యంతో భారత్‌ బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన (73) పరుగులతో రాణించింది. దీంతో భారత్‌ కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లకే లక్ష్యాన్ని అందుకుంది.

అత్యధిక వన్డేలకు నాయకత్వం: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌అత్యధిక వన్డేలకు నాయకత్వం: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్‌

జట్టు స్కోరు 96 పరుగుల మద్ద రణవీరా బౌలింగ్‌లో ఓపెనర్‌ పూనమ్‌ రైత్‌ (24) సురంగికకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌‌‌కు చేరింది. ఈ విజయంతో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం జరగనుంది.

1
42378

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు 195 వన్డేలాడిన మిథాలీ రాజ్‌ 118 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహారించింది.

ఫలితంగా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (117) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి బెలిందా క్లార్క్‌ (101) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, September 11, 2018, 19:02 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X