న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో మిథాలీ తర్వాత మంధాననే..

Smriti Mandhana becomes second-fastest Indian woman to reach 1000 T20I

హైదరాబాద్: ఐసీసీ టీ20 మహిళా ప్రపంచ కప్‌లో టీమిండియా దూసుకుపోతోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకోగా.. ఆస్ట్రేలియాతో నాలుగో మ్యాచ్‌లోనూ విజేతగా నిలిచి వేగాన్ని మరింత పెంచింది. గ్రూప్ బిలో భాగంగా పటిష్ట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 48 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ప్రపంచ కప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయదుందుబి మోగించించి గ్రూప్-బిలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.

ఊపందుకున్న మంధాన

ఊపందుకున్న మంధాన

శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, సీనియర్‌ మిథాలీ రాజ్‌లు అద్భుత ఇన్నింగ్స్‌లతో విజయాలందించగా.. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన ఊపందుకుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో 2, 26, 33లతో నిరాశ పర్చిన మంధాన ఆసీస్‌తో 55 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 83 పరుగులతో విజృంభించింది. ఈ ఇన్నింగ్స్‌తో భారత్‌ పటిష్టమైన ఆసీస్‌పై 48 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టీ20 క్రికెటర్లలో వేగంగా 1000 పరుగులు

టీ20 క్రికెటర్లలో వేగంగా 1000 పరుగులు

భారత మహిళా టీ20 క్రికెటర్లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 49 ఇన్నింగ్స్‌ల్లో మంధాన ఈ ఫీట్‌ సాధించగా.. మిథాలీ రాజ్‌ 44 ఇన్నింగ్స్‌ల్లో 2014ల్లోనే ఈ రికార్డు నమోదు చేసింది. ఇక భారత మహిళా క్రికెటర్లలో మిథాలీ (2283), హర్మన్‌ ప్రీత్‌ (1870) తర్వాత మంధానానే వెయ్యి పరుగులు పూర్తిచేసింది.

టీ20 ప్రపంచ కప్‌లో వేగవంతమైన 50

టీ20 ప్రపంచ కప్‌లో వేగవంతమైన 50

టీ20 ప్రపంచ కప్‌లో మంధాన వేగవంతమైన హాఫ్ సెంచరీ (31 బంతుల్లో) నమోదు చేసింది. ఇదే టోర్నీలో న్యూజిలాండ్‌పై 33 బంతుల్లో హర్మన్‌ప్రీత్‌ సాధించిన ఈ ఫీట్‌ను అధిగమించింది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆసీస్ మహిళల జట్టు మరో రెండు బంతులు మిగిలుండానే 119 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లాడి 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటి ఆసీస్‌ను బెంబెలెత్తించింది.

మెరుపు షాట్లతో అదరగొట్టిన మంధాన

మెరుపు షాట్లతో అదరగొట్టిన మంధాన

మిథాలీరాజ్‌కు విశ్రాంతినివ్వడంతో ఆమె స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన తానియా భాటియా (2) స్వల్ప స్కోరుకే ఔటైంది. కానీ మంధాన మాత్రం.. మెరుపు షాట్లతో అదరగొట్టింది. జెమిమా (6) ఔటైన తర్వాత హర్మన్‌ప్రీత్‌ క్రీజులోకి రావడంతో భారత ఇన్నింగ్స్‌ తీరే మారిపోయింది. వీళ్లిద్దరూ పోటీపడి మరీ ఆసీస్‌ బౌలర్లను ఉతికారు. ఈ క్రమంలో స్మృతి ఇన్నింగ్స్ ఆటకే హైలెట్‌గా నిలిచింది

Story first published: Sunday, November 18, 2018, 11:44 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X