న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దిశానిర్దేశం చేసేవారు లేరు: స్మిత్, వార్నర్ లేని లోటుపై హజెల్ వుడ్

Smith And Warner’s Absence Affected Youngsters Without Teachers | Oneindia telugu
Smith, Warner left young batsmen without teachers - Hazlewood

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ కు పాల్పడటంతో డేవిడ్ వార్న్, స్టీవ్ స్మిత్‌లు క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనతో మాజీ క్రికెటర్స్ తో పాటు ఇండియన్ క్రికెటర్స్ సైతం ఈ ఇద్దరిపై సానుభూతి చూపించారు. స్మిత్, వార్న్ కన్నీళ్లు పెట్టుకొని తమ తప్పును ఒప్పుకున్నా ఆస్ట్రేలియా బోర్డు వారి మీద కనికరం చూపించకుండా కఠిన చర్యలు తీసుకున్నది. క్రికెట్ అటకు విరుద్ధంగా ఎవరు ఇలా ప్రవర్తించిన ఉపేక్షేచించేది లేదని గట్టి హెచ్చరికలు చేసింది.

<strong>కేఎల్ రాహుల్ ఫామ్ ప్రపంచ కప్ కు చాలా ముఖ్యం : ఎమ్మెస్కె ప్రసాద్</strong>కేఎల్ రాహుల్ ఫామ్ ప్రపంచ కప్ కు చాలా ముఖ్యం : ఎమ్మెస్కె ప్రసాద్

సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం

సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరం

అయితే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీమ్ కు దూరం కావటం తో ఆస్ట్రేలియా ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఘోర పరాజయాలను చవిచూసింది. మొదటి సారిగా ఆస్ట్రేలియా గడ్డ మీద ఇండియా టెస్ట్ సిరీస్‌ను గెలిచి చరిత్ర నెలకొల్పింది. అయితే అదే టీమ్‌లో వార్నర్, స్మిత్ ఉంటే ఇండియాకు అంత తేలిగ్గా విజయం వరించేది కాదు.

జూనియర్స్ కు సలహాలు ఇచ్చేవారు లేరు

జూనియర్స్ కు సలహాలు ఇచ్చేవారు లేరు

అయితే సీనియర్స్ అయినా ఆటగాళ్లు దూరం కావటం తో ఆస్ట్రేలియా ఇంటా బయట పరాజయాలను చవి చూస్తుంది. ఇదే విషయం మీద ఆస్ట్రేలియా కెప్టెన్ హాజెల్ వుడ్ మాట్లాడుతూ "టీమ్ వారిద్దరూ లేక పోవటంతో ఆస్ట్రేలియా టీమ్ అనుభవ రాహిత్యంగా తయారైందని టీమ్‌లో జూనియర్స్ కు సలహాలు ఇచ్చేవారు లేరు" అని తన అసంతృప్తిని వ్యక్త పరిచాడు.

ప్రతి విషయాన్ని కోచ్‌లు చెప్పలేరు

ప్రతి విషయాన్ని కోచ్‌లు చెప్పలేరు

" కోచ్‌లు ఉన్నప్పటికీ సీనియర్ ప్లేయర్స్ ఇచ్చే సలహాలు ఫీల్డ్ లో ఎంతగానో ఉపయోగ పడతాయి. ప్రతి విషయాన్ని కోచ్‌లు చెప్పలేరని సీనియర్స్ లేని లోటు తీర్చలేనిదని దిశా నిర్దేశం చేసే వారు లేక పోవటంతో కురాళ్లు తమ తప్పుల నుంచి పాఠాలను నేర్చు కోలేకపోతున్నారు" అని చెప్పుకొచ్చాడు.

ఆరుగురు బ్యాట్స్ మెన్స్ కు అనుభవం లేకపోవటం

ఆరుగురు బ్యాట్స్ మెన్స్ కు అనుభవం లేకపోవటం

అయితే ఆస్ట్రేలియా టీమ్ చరిత్ర లో వరుసగా టాప్ ఆరుగురు బ్యాట్స్ మెన్స్‌కు అనుభవం లేకపోవటం ఇదే మొదటి సారి. దీనితో అనుభవ రాహిత్య కుర్రాళ్ళు పూర్తిగా కోచ్‌ల మీద ఆధార పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ప్రపంచ కప్‌లో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడతారో లేదో ఇప్పటివరకు స్పష్టత లేదు.

Story first published: Tuesday, February 19, 2019, 12:14 [IST]
Other articles published on Feb 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X