న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రబాడను మళ్లీ ఎలా తీసుకొచ్చారు: స్మిత్

Smith slams decision to overturn Rabada ban

హైదరాబాద్: క్రమ శిక్షణను ఉల్లంఘించినందుకు గాను రబాడపై నిషేదాన్ని జారీ చేసిన ఐసీసీ అతి కొద్ది కాలంలోనే నిర్ణయం మార్చుకుంది. విచారణ చేపట్టామని అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(ఐసీసీ) దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ నిషేధం ఎత్తివేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో రబాబ స్మిత్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని తొలుత ఐసీసీ రెండు టెస్టుల నిషేదం విధించింది. దీనిపై రబడా అప్పీల్‌ చేయగా విచారించిన అప్పీల్‌ కమిషనర్‌ మైకేల్‌ హెరాన్‌ నిషేదాన్ని ఎత్తి వేస్తూ రబడకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. దీంతో రబాడ గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో బరిలోకి దిగనున్నాడు.

అయితే ఈ తీర్పును స్మిత్‌ తప్పుబట్టాడు. రబడ తనని ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టాడని, ఇది వీడియోలో స్పష్టంగా తెలుస్తుందన్నాడు. వికెట్‌ పడగొట్టిన తర్వాత బౌలర్ల ఆనందం తనకు తెలుసని, కానీ ఓవర్‌గా రియాక్ట్‌ కావడం అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి విషయాల్లో ఐసీసీ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు.

విచారణలో తన వాదనలు వినకపోవడం ఆశ్చర్యం కలిగించిందని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. ఐసీసీ నిర్ణయం పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సిరీస్‌లో రబడ తన బౌలింగ్‌తో ఆసీస్‌ పతనాన్ని శాసిస్తున్నాడు. రెండు మ్యాచుల్లో ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Thursday, March 22, 2018, 13:07 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X