న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ టాంపరింగ్: తెరపైకి అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌, చాపెల్ ఆసక్తికర వ్యాఖ్య

By Nageshwara Rao
Smith and Bancroft will struggle for the rest of their lives, claims Chappell

హైదరాబాద్: ట్రివర్‌ చాపెల్‌... 80 దశకాల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు. 1981 వరల్డ్‌ కప్‌ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ట్రివర్‌ చాపెల్‌(గ్రెగ్‌ చాపెల్‌ సోదరుడు) అసాధారణ రీతిలో బౌలింగ్‌ చేశాడనే ఆరోపణలను ఎదుర్కొన్నాడు. తద్వారా అతడు తన జీవితంలో ఎంతో విలువైన వాటిని కోల్పోయాడు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. సొంత అభిమానులు కూడా ఛీ కొడుతున్నారు.

ఈ నేపథ్యంలో బాల్‌ టాంపరింగ్ వివాదంపై ట్రివర్ చాపెల్ డైలీ టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో తాను తప్పు చేశాననే కారణంగా తాను ఎంతో క్షోభ అనుభవించానని చెప్పాడు. 1981 వరల్డ్ కప్ సందర్భంగా చోటు చేసుకున్న వివాదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

Smith and Bancroft will struggle for the rest of their lives, claims Chappell

'న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కివీస్‌కు ఆరు పరుగులు అవసరం. అప్పుడు కివీస్‌ టెయిలెండర్‌ బ్రేన్‌ మెఖేన్‌ క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న నా సోదరుడు గ్రెగ్‌ చాపెల్‌ అండర్‌ఆర్మ్‌ బౌలింగ్‌ చేయాల్సిందిగా సూచించాడు. నేను కూడా అది మంచి ఆలోచన అని భావించాను. కానీ అది నా భవిష్యత్తును అంధకారంలో పడేస్తుందని ఊహించలేదు' అని అన్నాడు.

అలా బౌలింగ్ చేయడం తప్పేమీ కాకపోయినప్పటికీ, తాను చేసిన చిన్నపాటి తప్పిదం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రఖ్యాతి మంటగలిసిందని అన్నాడు. 'నేను చేసిన తప్పిదం వల్ల అప్పటి వరకు క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రఖ్యాతి మంటగలిసింది. ఇప్పటికీ చాలామంది దాని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. ఈ వివాదం కారణంగా నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది' అని చెప్పాడు.

'మళ్లీ నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఎంతో నష్టపోయాను. జీవితం పరిపూర్ణం కావాలంటే కుటుంబం ఉండాలి. కానీ నాకు అవేమీ లేవు. ప్రస్తుతం పిల్లలకు క్రికెట్‌ కోచ్‌గా ఉంటూ, గోల్ఫ్‌ ఆడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాను' అని 65 ఏళ్ల చాపెల్ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

'గత 37 ఏళ్లుగా ఈ వివాదంపై మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మసకబార్చిన వారిలో ముఖ్య పాత్రధారి ఎవరంటే ట్రివర్‌ చాపెల్‌ అని గూగుల్‌లో కనిపిస్తుంది. అయితే, తాజా ఉదంతం వల్ల నా స్థానంలో స్మిత్‌, బెన్‌క్రాప్ట్‌ల పేరు కనిపించడంతో కాస్త ఉపశమనం కలుగుతుంది' అని పేర్కొన్నాడు.

'ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇది నేను స్వయంగా అనుభవించాను. ఇప్పుడు స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌లు కూడా అనుభవించక తప్పదు. ఈ వివాదం వారి కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకు వారు సిద్ధంగా ఉండాలి' అని చాపెల్‌ అన్నాడు.

Story first published: Tuesday, March 27, 2018, 15:10 [IST]
Other articles published on Mar 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X