మ్యాచ్ ఫిక్సింగ్: శ్రీలంక క్రికెట‌ర్‌పై రెండేళ్ల నిషేధం

Posted By:

హైదరాబాద్: మ్యాచ్ ఫిక్సింగ్‌‌కు పాల్పడ్డాడన్న ఆరోప‌ణ‌ల‌తో శ్రీలంక మాజీ క్రికెట‌ర్ చ‌మ‌ర సిల్వాపై శ్రీలంక క్రికెట్ బోర్డు రెండేళ్లపాటు నిషేధించింది. ఈ ఏడాది మొద‌ట్లో జ‌రిగిన టైర్-బి ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత‌ను మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఏడు నెలలు దీనిపై విచారణ జరిపిన శ్రీలంక క్రికెట్ బోర్డు చివరకు అతడిపై నిషేధం విధించింది. ఈ ఏడాది జనవరిలో ప‌న‌దురా క్రికెట్ క్ల‌బ్‌, క‌లుతారా ఫిజిక‌ల్ క‌ల్చ‌ర్ క్ల‌బ్‌ల మ‌ధ్య ఈ మ్యాచ్ జ‌రిగింది. ఈ మూడు రోజుల మ్యాచ్‌లో చివ‌రి రోజు ఫిక్సింగ్ జ‌రిగిన‌ట్లు అనుమానించారు.

SLC bans Chamara Silva for 2 yrs on fixing charges

ఒకే రోజు 24 వికెట్లు ప‌డిపోవ‌డం, 13 ఓవ‌ర్ల‌పాటు ర‌న్‌రేట్ ప‌దికి త‌గ్గ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగిందన్న సందేహాం కలిగింది. ఈ మ్యాచ్‌లో ప‌న‌దురా క్రికెట్ క్ల‌బ్‌ జట్టుకు చమర సిల్వా కెప్టెన్‌గా ఉన్నాడు. మరోవైపు ప్రత్య‌ర్థి జట్టు కెప్టెన్‌గా ఉన్న మ‌నోజ్ దేశ‌ప్రియ మీద కూడా రెండేళ్ల పాటు నిషేధ‌ం విధించారు.

అంతేకాదు రెండు క్లబ్‌లకు 500,000 జరిమానా కూడా విధించింది. శ్రీలంక తరుపున 1999 నుంచి 2011 మధ్య కాలంలో 11 టెస్టులు, 75 వ‌న్డేలు ఆడిన చమర సిల్వా అంతర్జాతీయ స్ధాయిలో పెద్దగా రాణించలేదు.

Story first published: Sunday, September 17, 2017, 11:43 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి