న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరాజ్ ఒక్కడే పది వికెట్లు పడేసిన వేళ.. విజేతగా భారత్ ఏ

Siraj takes 10-for as India A beat South Africa A by innings and 30 runs

హైదరాబాద్: భారత యువ పేసర్‌ మొహమ్మద్ సిరాజ్ దక్షిణాఫ్రికా-ఏతో తొలి అనధికార టెస్టులో అదరగొట్టాడు. మ్యాచ్‌లో అతడు పది వికెట్లతో విజృంభించడంతో భారత్‌-ఏ ఇన్నింగ్స్‌ 30 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో దక్షిణాఫ్రికాను దెబ్బతీసిన సిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. 99/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు(మంగళవారం) రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు..సిరాజ్(5/73) ధాటికి 128.5 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది.

మొదటి మూడు రోజులతో పోల్చుకుంటే చివరి రోజు సఫారీలు దీటైన పోటీనిచ్చారు. ఆఖరి ఆరు వికెట్లు తీయడానికి యువ భారత బౌలర్లకు 88.5 ఓవర్లు అవసరమయ్యాయి. ఓ దశలో 121/5 కనిపించినా..రూడీ సెకండ్(94), షాన్‌వాన్ బెర్గ్(50) ఆరో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వాన్ బెర్గ్‌ను నవదీప్‌ షైనీ(3/71) ఔట్ చేసినా..ఆఖరి వరుస బ్యాట్స్‌మెన్ భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. మొత్తంగా మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ, పృథ్వీషా సెంచరీ, సిరాజ్ 10 వికెట్ల ప్రదర్శనతో భారత ఎ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.

ఇరు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ ఈనెల 10 నుంచి బెంగళూరులో జరుగుతుంది. ఓటమి నుంచి దక్షిణాఫ్రికాను గట్టెక్కించేందుకు సెకండ్‌ (94), వోన్‌ బర్గ్‌ (50) పోరాడారు. ఐతే గుర్బాని (2/45)తో పాటు అక్షర్‌ పటేల్‌ (1/43), చాహల్‌ (1/85) సిరాజ్‌ (5/73)కు అండగా నిలవడంతో దక్షిణాఫ్రికా కథ ముగిసింది.

Story first published: Wednesday, August 8, 2018, 10:09 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X