న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్‌తో ఆస్ట్రేలియా ఏను గడగడలాడిస్తున్న మొహమ్మద్ సిరాజ్

Siraj guides India A to command despite Khawaja hundred

హైదరాబాద్: పదునైన పేస్‌తో బెంబేలెత్తిస్తోన్న హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియా 'ఎ'తో ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్‌ ఏ తరఫున బరిలో దిగిన సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు. ఎనిమిది వికెట్లు సాధించి తన ఫస్ట్‌ క్లస్‌ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

దీనిపై సిరాజ్ మాట్లాడుతూ.. 'ఇలా స్వింగ్ ఉన్న బంతులు విసిరితే.. ఆస్ట్రేలియా ఏ జట్టు ఆటగాళ్లు తడబడతారనే ముందుగానే ఊహించాం. దీనిపై జాతీయ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ దగ్గర సలహా తీసుకున్నాను. ఇలా చేస్తున్న సమయంలో మధ్యలో ఏదైనా సమస్య ఉంటే రాహుల్ ద్రవిడ్ నుంచి మంచి సహకారం అందింది.' అని చెప్పుకొచ్చాడు. ఇలా ఆస్ట్రేలియా ఏ జట్టు పతనం కావడంపై ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఖ్వాజా స్పందించి ప్రస్తుతం జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చూస్తామని చెప్పాడు. సెకండ్ ఇన్నింగ్స్ కచ్చితంగా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

సిరాజ్‌ ధాటికి టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖాజా (127) 20 ఫోర్లు సెంచరీతో ఆకట్టుకోగా... అతనికి లబ్‌షేన్‌ (60) 11 ఫోర్లతో చక్కటి సహకారం అందించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 114 పరుగులు జతచేయడంతో ఆసీస్‌ కోలుకుంది. వీరిద్దరితో పాటు కుర్టీస్‌ పీటర్‌సన్‌ (31), హెడ్‌ (4), హ్యాండ్స్‌కోంబ్‌ (0), కెప్టెన్‌ మిచెల్‌ మార్‌‡్ష (0), నాసెర్‌ (0), ట్రైమెన్‌ (0)లను సిరాజ్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు.

కుల్దీప్‌ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. ఇందులో సిరాజ్ మొహమ్మద్ సిరాజ్ 8 వికెట్లు పడగొట్టి.. 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Story first published: Monday, September 3, 2018, 13:10 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X