న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సీనియర్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నా.. ఎంతో నేర్చుకున్నా'

India vs Bangladesh 2019 : Shubman Gill Said 'He Learned A lot From Seniors'
Shubman Gill said learn a lot from seniors When sharing the dressing room

ముంబై: టీమిండియా సీనియర్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నా. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అని యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ తెలిపాడు. ఇన్నింగ్స్‌ వేగం ఎలా పెంచాలో తెలుసుకున్నా అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ కోసం 20 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ జట్టులోకి మొదటిసారిగా ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌ ముందు టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన గిల్‌. కేవలం 16 పరుగులే చేశాడు.

అరుదైన ఫీట్: ఒకే ఇన్నింగ్స్‌.. 10 వికెట్లు!!అరుదైన ఫీట్: ఒకే ఇన్నింగ్స్‌.. 10 వికెట్లు!!

అండర్ -19, భారత-ఏ జట్టు తరపున విశేషంగా రాణిస్తున్నా.. భారత సెలెక్టర్లు వెస్టిండీస్ సిరీస్‌కు శుభ్‌మన్‌ను ఎంపిక చేయలేదు. దీంతో మాజీల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో శుభ్‌మన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారు. ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్ట్ స్పెషలిస్ట్ ఛతేశ్వర పుజారా, అంజిక్య రహానే, రోహిత్ శర్మ వంటి సీనియర్లతో కలిసి డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నాడు.

బుధవారం సింథాల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శుభ్‌మన్‌ గిల్‌ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలు మీడియాతో పంచుకున్నాడు. 'సీనియర్ ఆటగాళ్లతో డ్రస్సింగ్‌ రూమ్‌ పంచుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. నేనెంతో నేర్చుకున్నా. మ్యాచ్‌కు ముందు వారెలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నా. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఎలా దృష్టి పెడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, మ్యాచ్‌ పరిస్థితులను బట్టి ఇన్నింగ్స్‌ వేగాన్ని ఎలా మారుస్తున్నారో గమనించా' అని తెలిపాడు.

'అండర్ -19 బౌలింగ్ అంతర్జాతీయ క్రికెట్ మాదిరిగా లేదు. జూనియర్ స్థాయిలో పరుగులు చేయగలిగే సౌలభ్యం ఇక్కడ ఉండదని తెలుసు. నేను అది అంగీకరిస్తున్నా. న్యూజిలాండ్‌లో వికెట్లపై బ్యాటింగ్ చాలా కఠినమైనది. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా అనుభవం ఉండాలి. కోచ్ రాహుల్ ద్రవిడ్ యువ క్రికెటర్లపై ప్రభావాన్ని చూపాడు. ఎవరి ఆటను అనుకరించటానికి ప్రయత్నించవద్దు, ఎప్పుడూ సహజ శైలి ఆట ఆడమని సలహా ఇచ్చాడు. పింక్ బాల్ టెస్ట్ కోసం వేచిస్తూస్తున్నా. బంతి ఎలా తిరుగుతుందో అని ఆతృతగా ఉన్నా' అని శుభ్‌మన్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 7, 2019, 10:46 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X