న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: రెండు లైఫ్స్.. శార్దూల్ ఠాకూర్ త్యాగం..అంతే! శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ!

Shubman Gill Hits Double Century After Shardul Thakur Sacrifices His Wicket and 2 Drop Catches

హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో 208) డబుల్ సెంచరీతో చెలరేగాడు. న్యూజిలాండ్‌తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 19 ఫోర్లు, 9 సిక్స్‌లతో వీరవిహారం చేశాడు. ఓవైపు భారత స్టార్ ఆటగాళ్లంతా విఫలమవ్వగా.. మరోవైపు శుభ్‌మన్ అసాధారణ బ్యాటింగ్‌తో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.

87 బంతుల్లో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్.. మరో 58 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు. ఓ దశలో 137 బంతుల్లో 169 పరుగులతో నిలిచిన శుభ్‌మన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చివరి 8 బంతుల్లో 6,0,6,0,1,6,6,6‌తో 31 పరుగులు చేసి కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. హ్యాట్రిక్ సిక్స్‌లతో డబుల్ సెంచరీ సాధించడం ఈ మ్యాచ్‌కే హైలైట్.

మూడు లైఫ్స్‌తో..

మూడు లైఫ్స్‌తో..

అయితే శుభ్‌మన్ అసాధారణ ఇన్నింగ్స్‌కు లక్ కూడా కలిసొచ్చింది. మొత్తం మూడు సార్లు శుభ్‌మన్ గిల్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ త్యాగం కూడా శుభ్‌మన్ డబుల్ సెంచరీకి బాటలు వేసింది. శార్దూల్ ఠాకూర్ సమయస్పూర్తిగా వ్యవహరించకపోయి ఉంటే శుభ్‌మన్ ఈ భారీ ఇన్నింగ్స్ ఆడకపోయేవాడు.. టీమిండియా భారీ స్కోర్ చేసేది కాదు. హాఫ్ సెంచరీ ముంగిటే న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఘోర తప్పిదంతో శుభ్‌మన్ గిల్ బచాయించాడు.

క్యాచ్‌తో పాటు స్టంపౌట్ మిస్..

క్యాచ్‌తో పాటు స్టంపౌట్ మిస్..

భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ టామ్ లాథమ్ అందుకోలేకపోయాడు. క్యాచ్‌తో పాటు స్టంపౌట్ కూడా చేయలేకపోయాడు. ఈ ఓవర్ తొలి బంతిని స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం శుభ్‌‌మన్ గిల్ చేయగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వైపు దూసుకెళ్లింది. బంతిని అందుకోలేకపోయిన టామ్ లాథమ్ స్టంపింగ్ కూడా చేయలేకపోయాడు. అప్పుడు శుభ్‌మన్ 45 పరుగులే చేశాడు. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న శుభ్‌మన్ తనదైన శైలిలో చెలరేగాడు.

రిటర్న్ క్యాచ్ అందుకోలేక..

రిటర్న్ క్యాచ్ అందుకోలేక..

93 పరుగుల వద్ద మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో సెహ్వాగ్ తరహాలో సిక్స్ బాదిన శుభ్‌మన్ గిల్.. తర్వాతి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం కూడా శుభ్‌మన్ గిల్‌ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హెన్రీ షిప్లే వేసిన 38వ ఓవర్‌లో శుభ్‌మన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అతను అందుకోలేకపోయాడు. ఈ ఓవర్ మూడో బంతిని స్ట్రైట్‌గా కొట్టే ప్రయత్నం చేయగా.. హెన్రీ షిప్లే లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టే ప్రయత్నం చేసినా బంతి చిక్కలేదు. అప్పుడు శుభ్‌మన్ గిల్ 128 పరుగులతో ఉన్నాడు.

శార్దూల్ ఠాకూర్ త్యాగం..

శార్దూల్ ఠాకూర్ త్యాగం..

డబుల్ సెంచరీకి చేరువలో కూడా శుభ్‌మన్ రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్ త్యాగంతో గట్టెక్కాడు. ఇన్నింగ్స్ 47వ ఓవర్ నాలుగో బంతిని కవర్స్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ శార్దూల్ ఠాకూర్ స్పందించలేదు.

అప్పటికే శుభ్‌మన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు చేరగా.. శార్దూల్ ఠాకూర్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. శార్దూల్ సమయస్పూర్తిగా వ్యవహరించకపోయినా.. శుభ్‌మన్ డబుల్ సెంచరీ చేసేవాడు కాదు. శార్దూల్ ఔటైనప్పుడు శుభ్‌మన్ గిల్ 169 పరుగులతో ఉన్నాడు.

Story first published: Wednesday, January 18, 2023, 20:39 [IST]
Other articles published on Jan 18, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X