న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్‌ గిల్‌పై బీసీసీఐ కొరడా.. మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత!!

Shubman Gill Fined 100% Match Fees For Dissent ! || Oneindia Telugu
Shubman Gill Fined 100 PerCent Match Fee For Showing Dissent to Umpire in Ranji Match

ముంబై: టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కారణంగా.. అతడి మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధించింది. మరోవైపు ఇదే వివాదానికి సంబంధించి ఢిల్లీ ఆటగాడు ధ్రువ్‌ షోరే మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత పడింది. గతవారం ఢిల్లీతో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో తనను ఔట్‌గా ప్రకటించడంపై అంపైర్‌ రఫీతో శుభ్‌మన్‌ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.

ఇన్నింగ్స్ చివరలో స్టోక్స్‌ మ్యాజిక్‌.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ విజయంఇన్నింగ్స్ చివరలో స్టోక్స్‌ మ్యాజిక్‌.. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌ విజయం

అంపైర్‌ తప్పుడు నిర్ణయం:

అంపైర్‌ తప్పుడు నిర్ణయం:

గత శుక్రవారం ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు సాన్విర్‌ సింగ్‌- శుభమాన్ గిల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. సాన్విర్‌ సింగ్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడంతో.. గుర్‌క్రీత్‌ సింగ్‌ మన్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ఢిల్లీ బౌలర్‌ సిమర్‌ జీత్‌ సింగ్‌ వేసిన 14 ఓవర్‌ తొలి బంతిని గిల్ ఎదుర్కొన్నాడు. అయితే, అది బ్యాట్‌కు తగలకుండానే వెళ్లి వికెట్ కీపర్ అనుజ్‌ రావత్‌ చేతిల్లో పడింది. ఢిల్లీ ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ పఠాక్‌ ఔట్‌గా ఇచ్చాడు.

భారీ జరిమానా:

భారీ జరిమానా:

తాను ఔట్‌ కాదనే విషయం శుభమాన్ గిల్‌కు స్పష్టంగా తెలియడంతో.. క్రీజ్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని పట్టుపట్టాడు. ఔట్‌ కాదని టీవీ రిప్లేలో తేలడంతో.. గిల్‌కు మరింత కోపం వచ్చింది. దీంతో అంఫైర్‌ను దుర్బాషలాడాడు. చివరకు మ్యాచ్‌ రిఫరీ కలగజేసుకుని గిల్‌కు సర్ధి చెప్పాడు. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ను దూషించడంతో గిల్‌పై బీసీసీఐ కొరడా ఝళిపించింది. మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధించింది.

కెప్టెన్‌గా తొలగించాలి:

కెప్టెన్‌గా తొలగించాలి:

భారత-ఏ జట్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ది రౌడీ ప్రవర్తన అని టీమిండియా మాజీ క్రికెటర్‌ బిషన్‌ బేడీ అభిప్రాయపడ్డారు. తాజాగా ట్విటర్‌లో ఓ విలేకరి గిల్‌ విషయమై స్పందించాలని బేడీని కోరాడు. 'భారత-ఏ జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఇలాంటి రౌడీ ప్రవర్తన కలిగిన ఏ క్రికెటర్‌ని క్షమించరాదు. ఎంత టాలెంట్‌ ఉన్న ఆటగాడైనా.. ఆట కంటే ఎక్కువ కాదు. మ్యాచ్‌ రిఫరీ ఫిర్యాదు చేయకముందే గిల్‌ను కెప్టెన్‌గా తొలగించాలి. అతని స్థానంలో సరైన ఆటగాడిని ఎంపిక చేసి హెచ్చరిక చేయాలి' అని బేడీ అన్నారు.

Story first published: Wednesday, January 8, 2020, 10:35 [IST]
Other articles published on Jan 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X