న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రేయస్‌ అయ్యర్‌ మ్యాజిక్ ట్రిక్‌.. చూస్తే షాకే (వీడియో)!!

Shreyas Iyer turns in-house magician during forced break amid coronavirus pandemic

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. లక్షల్లో దీని బారిన పడ్డారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని అన్ని దేశ ప్రభుత్వాలు సూచించాయి. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు సైతం తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తన మ్యాజిక్‌ ట్రిక్‌ను ప్రదర్శించాడు.

<strong>పీటర్సన్‌ హిందీ ట్వీట్‌.. స్పందించిన భారత ప్రధాని.. ఆసక్తికర సంభాషణ!</strong>పీటర్సన్‌ హిందీ ట్వీట్‌.. స్పందించిన భారత ప్రధాని.. ఆసక్తికర సంభాషణ!

సోదరితో కలిసి కార్డ్‌ ట్రిక్‌:

సోదరితో కలిసి కార్డ్‌ ట్రిక్‌:

తాజాగా శ్రేయస్‌ అయ్యర్ హౌస్‌ మాజీషియన్‌గా మారిపోయి తన సోదరితో కలిసి కార్డ్‌ ట్రిక్‌ షోను ప్రదర్శించాడు. కార్డ్‌ ట్రిక్‌ షో భాగంగా.. తొలుత అయ్యర్‌ కొన్ని పేకముక్కల్ని తీసుకొని అందులో ఒకటి ఎంపిక చేసుకోమని తన సోదరికి చెప్తాడు. ఆమె ఒక కార్డు (8)ను తీసుకొని మనకు చూపిస్తుంది. దాన్ని మళ్లీ ఆ పేక ముక్కల్లో కలిపాక.. శ్రేయస్‌ మరో కార్డుని ఎంపిక చేసుకోమని ఆమెకు చెబుతాడు. నటాషా రెండో ముక్క (2)ను తీసి మనకు చూపించాక..దాన్ని మళ్లీ పేక ముక్కల్లో కలిపేస్తాడు శ్రేయస్‌.

శ్రేయస్‌ మ్యాజిక్ ట్రిక్‌:

శ్రేయస్‌ మ్యాజిక్ ట్రిక్‌:

రెండో ముక్క తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ తన మ్యాజిక్ ట్రిక్‌ను ప్రదర్శిస్తాడు. నటాషా తొలిసారి ఎంపిక చేసుకున్న పేక ముక్కను బయటకు విసురుతాడు. దీంతో నటాషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ ట్రిక్‌ను బీసీసీఐ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 'మీ ముందుకు వస్తున్నాడు.. మన జట్టులోని మెజీషియన్‌ శ్రేయస్‌ అయ్యర్‌. మేమంతా ఇళ్లల్లో ఉంటుండగా, మా అందరికీ సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు శ్రేయస్‌ అయ్యర్‌' అని పోస్టులో పేర్కొంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రేయస్‌ అయ్యర్‌కు మ్యాజిక్‌ ట్రిక్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకే పలుమార్లు తన మాయాజాలం ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.

 ద్రవిడ్ కూడా:

ద్రవిడ్ కూడా:

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అయితే కరోనాతో వచ్చిన ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న రాహుల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్యాట్‌తో బంతిని కొడుతూ, పుస్తకాలు చదువుతూ, ఐపాడ్‌లో పనిచేస్తూ రకరకాలుగా గడుపుతూ కాలక్షేపం చేశాడు. పలు విధాలుగా చేసిన దానిని ఒక వీడియోగా ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది వైరల్‌గా మారింది.

స్వీయ నిర్భందంలోనే ఉంటూనే ఎంజాయ్‌:

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌-13ను వచ్చే నెల 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. కానీ అప్పుడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. జులై-సెప్టెంబర్ మధ్యలో ఐపీఎల్ జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తుంటే.. క్రికెటర్లు మాత్రం హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వీయ నిర్భందంలోనే ఉంటూనే ఎంజాయ్‌ చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు.

Story first published: Saturday, March 21, 2020, 17:04 [IST]
Other articles published on Mar 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X