న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ లేకపోవడం శ్రేయాస్ అయ్యర్ కి బాగా కలిసొచ్చిందా..?

Shreyas Iyer May Replace Virat Kohli For India-Afghanistan Test

హైదరాబాద్: కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తొలిసారి కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కే అవకాశముంది. జూన్‌ 14న ఆరంభమయ్యే ఈ టెస్టు కోసం సెలక్షన్‌ కమిటీ మంగళవారం జట్టును ప్రకటించనుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే చారిత్రక టెస్టు జట్టులో విరాట్ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చోటు దక్కించుకోనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ అతని పేరును పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు

విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు

జూన్ 14న ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌లో పాల్గొనే భారత బృందాన్ని సెలక్షన్ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ సందర్భంగా ముందస్తు ప్రాక్టీస్ కోసం విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు వెళుతుండడంతో అతనిస్థానంలో అయ్యర్ ఎంపిక కానున్నాడు. కాగా, చారిత్రక టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌గా జట్టు ఉపసారథి అజింక్య రహానే బాధ్యతలు స్వీకరించనున్నాడు.

కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికవడం లాంఛనమే

కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికవడం లాంఛనమే

ఈ సిరీస్‌తోపాటు ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కూ కోహ్లీ దూరం కానున్న నేపథ్యంలో వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్‌శర్మ ఎంపికవడం లాంఛనమేనని బీసీసీఐ అధికారి తెలిపారు. ఐర్లాండ్‌తో సిరీస్‌లోనూ యువ ఆటగాళ్లకు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తున్నది.

పుజార, ఇషాంత్‌శర్మ అందుబాటులో

పుజార, ఇషాంత్‌శర్మ అందుబాటులో

ఇప్పటికే కౌంటీ క్రికెట్ ఆడుతున్న జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజార, స్పీడ్‌స్టర్ ఇషాంత్‌శర్మ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టెస్టుకు అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది. టెస్టు మ్యాచ్ జరిగే రోజులలో పుజార, ఇషాంత్‌శర్మలు ప్రాతినిథ్యం వహించే యార్క్‌షైర్, ససెక్స్ జట్లకు ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టు జరిగే సమయంలో ఎలాంటి మ్యాచ్‌లు లేవని తెలిపింది.

రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా స్థానాలలో అక్షర్ పటేల్, విజయ్‌శంకర్:

రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా స్థానాలలో అక్షర్ పటేల్, విజయ్‌శంకర్:

వీరిద్దరు టెస్టు మ్యాచ్ ఆడరనే విషయంలో అన్నీ పుకార్లేనని కొట్టిపడేసింది. ఇటీవలి కాలంలో రాణించలేకపోతున్న రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా స్థానంలో విజయ్‌శంకర్ స్థానం దక్కించుకుంటారని సెలక్షన్ కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారు. వచ్చేనెల 22 నుంచి వెస్టిండీస్ ఏ, ఇంగ్లండ్ లయన్స్(ఏజట్టు)తో జరిగే ముక్కోణపు సిరీస్‌లో ఆడే భారత ఏ జట్టు ఎంపిక కూడా నేడు జరుగనుంది. యువ ప్రపంచకప్ హీరోలు పృథ్వీషా, శివమ్‌మావి, శుభమ్‌గిల్ ఈ జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.

Story first published: Tuesday, May 8, 2018, 8:53 [IST]
Other articles published on May 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X