న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas Iyer: అదో పెద్ద తలనొప్పి యవ్వారం.. దుమారం రేపుతున్న శ్రేయస్ అయ్యర్ కామెంట్లు

 shreyas iyer sensational comments on ceo interfering the team selection.

ఐపీఎల్-2022లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌‌కతా నైట్‌రైడర్స్‌ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 52పరుగుల భారీ తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 165పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 166పరుగుల టార్గెట్ ఛేదనలో పూర్తిగా తడబడింది. ఇక 17.3ఓవర్లలో 113పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్ రేసులో ఇంకా కొనసాగుతోంది. అయితే ఇప్పటికే ప్లేఆఫ్ రేసులో ముందున్న జట్లను దాటి కేకేఆర్ ప్లేఆఫ్ చేరుకోవడం అంత సులభమేం కాదు. మిగతా జట్ల జయాపజయాలు కేకేఆర్ ప్లేఆఫ్ రేసును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ ఓడినా కేకేఆర్ అధికారికంగా ప్లేఆఫ్ నుంచి దూరమవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు తుది టీంను ఎలా సెలక్ట్ చేస్తున్నారు అని కామెంటర్ మురళీ కార్తీక్ అడిగిన ప్రశ్నకు శ్రేయస్ బదులిస్తూ.. టీంను ఎంపిక చేయడం చాలా టఫ్ విషయమని, మా ఫ్రాంఛైజీ సీఈవో కూడా టీం సెలెక్షన్లో జోక్యం చేసుకుంటున్నాడని పేర్కొన్నాడు. దీంతో ఈ విషయమై నెట్టింటా డిబేట్లు మొదలయ్యాయి.

ముంబైతో మ్యాచ్‌లో 5 మార్పులతో బరిలోకి కేకేఆర్

ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు కేకేఆర్ జట్టులో 5మార్పులు చోటుచేసుకున్నాయి. అజింక్యా రహానే, ప్యాట్ కమిన్స్, వెంకటేష్ అయ్యార్, వరుణ్ చక్రవర్తి, షెల్డన్ జాక్సన్ టీంలోకి వచ్చారు. ఇన్ని మార్పులతో కేకేఆర్ బరిలోకి దిగడం ఆశ్చర్యకరంగా అన్పించింది. మ్యాచ్ గెలిచాక మురళీ కార్తీక్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అభిప్రాయాలు తెలుసుకుంటూ.. ప్లేయర్లను తుది జట్టులో ఎంపిక చేసేటప్పుడు ఎలా ఫీలవుతావు అని అడిగాడు. దీనిపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. తుది జట్టు కూర్పు అంత సులభం కాదని అంగీకరించాడు. కొన్ని సమయాల్లో ఫ్రాంచైజీ సీఈవో వెంకీ మైసూర్ కూడా జట్టు ఎంపికలో పాల్గొంటారని అతను వెల్లడించాడు.

భారీ తేడాతో గెలవడం సంతోషం

'ప్లేయర్లు తుది జట్టులో ఆడతారో లేదో చెప్పడం నిజంగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు నిరాశచెందుతారేమోనని ఫీలవుతుంటాం. తుది సెలక్షన్ విషయంలో జట్టు కోచ్‌ల సహాయం తీసుకుంటాం. పిచ్ రిపోర్ట్, ఆటగాళ్ల ఫామ్ అన్నింటినీ బేరీజు వేసుకుంటాం. అప్పుడే తుది జట్టును ఎంపిక చేసుకుంటాం. కోచ్‌లతో పాటు కొన్నిసార్లు జట్టు సీఈవో కూడా సెలక్షన్ విషయంలో చొరవ తీసుకుంటారు' అని శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం మురళీ కార్తీక్‌తో చెప్పాడు.

శ్రేయస్ వ్యాఖ్యలపై నెట్టింట సెటైర్లు

ఒక జట్టు సెలక్షన్లో ఫ్రాంచైజీ సీఈవో కలగజేసుకోవడం ఏంటో విడ్డూరంగా ఉందని పలువురు నెటిజన్లు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరు అయితే సీఈవో కలగజేసుకునే విషయాన్ని శ్రేయస్ ప్రస్తావించడం వల్ల తర్వాతి సీజన్లో శ్రేయస్ కెప్టెన్ పదవికి ఎసరు తప్పదని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ఫ్రాంచైజీ సీఈవోలు ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడాన్ని సమర్థిస్తుంటే మరికొందరు తప్పుపడుతున్నారు. ఫ్రాంచైజీలో జట్టు సెలక్షన్ అనేది కెప్టెన్ నిర్ణయం కాదా ఇప్పటివరకు మేము అలాగే అనుకున్నామంటూ కొందరు దెప్పిపొడుస్తున్నారు.

Story first published: Tuesday, May 10, 2022, 16:22 [IST]
Other articles published on May 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X