న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పీసీబీపై ధ్వజమెత్తిన అక్తర్‌.. భారత్‌ని చూసి నేర్చుకోవాలని చురకలు!!

Shoaib Akhtar says Pakistan Should Learn From India How They Invested in U19 Squad


కరాచి:
అండర్‌-19 వరల్డ్‌కప్‌లో పాక్ చెత్త ప్రదర్శన చేయడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై ఆ దేశ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. అండర్-19 జట్టుకి ఏ తరహా మెరుగైన శిక్షణ ఇవ్వాలో భారత్‌ని చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని ఆయన సూచించాడు. ఇక క్రికెట్ ఆట ఎలా ఆడాలో, ఒత్తిడిని ఎలా అధిగమించాలో భారత యువ జట్టును చూసి నేర్చుకోవాలంటూ చురకలంటించాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.

అయ్యో సర్ఫరాజ్‌.. ఆ పదవి కూడా పోతుందా?!!అయ్యో సర్ఫరాజ్‌.. ఆ పదవి కూడా పోతుందా?!!

పాకిస్తాన్‌లో ఎంతోమంది సీనియర్‌ క్రికెటర్లు ఉన్నా వారిని పట్టించుకోకుండా.. కింది స్థాయి కోచింగ్‌ ఇస్తే ఫలితం ఇలానే ఉంటుందంటూ అక్తర్‌ మండిపడ్డాడు. 'పాకిస్తాన్‌లో యూనస్‌ ఖాన్‌, మహ్మద్‌ యూసఫ్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు. వారిద్దరూ పాక్ జట్టుకు సాయం అందించడానికి ముందుకొచ్చినా.. బోర్డు మాత్రం సుముఖంగా లేదు. బీసీసీఐని చూసి నేర్చుకోండి. జూనియర్‌ స్థాయిలో వారి కోచింగ్‌ ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఓసారి చూడండి' అని అక్తర్‌ అన్నాడు.

'భారత అండర్-19 జట్టుకి కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాడు ఉన్నాడు. ఒక గొప్ప ఆటగాడు కోచ్‌గా ఉండాలంటే.. కచ్చితంగా అతని స్థాయికి తగినట్లు జీతభత్యాలు ఇవ్వాలి. చాలామంది క్రికెటర్లు ద్రవిడ్‌ శిక్షణలో రాటుదేలి ఇప్పుడు సత్తాను చాటుతున్నారు. నాతో పాటు అండర్-19 జట్టుకి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు మహ్మద్ యూసఫ్, యూనిష్ ఖాన్ తదితరులు రెడీగా ఉన్నారు. మా కోచింగ్‌లో జట్టు శిక్షణ పొంది ఉంటే ఈ తరహాలో పేలవ ప్రదర్శన చేసేదా?' అని అక్తర్‌ ప్రశ్నించాడు.

'జూనియర్‌ స్థాయి నుంచి క్రికెటర్ల ప్రతిభను గుర్తించడంతో పాటు సరైన కోచింగ్‌ ఇవ్వాలి. అప్పుడే జట్టు బలంగా మారుతుంది. మరి మనం ఎప్పుడూ ఒక ప్రతిభ ఉన్న సీనియర్‌ క్రికెటర్‌ను అండర్‌-19 స్థాయిలో కోచ్‌గా నియమించుకుందాం. పీసీబీ ఏదో జాబ్‌ ఉందంటే యూనిస్‌ ఖాన్‌ దరఖాస్తు చేసుకోగా.. అతనితో బేరాలాడారు. యూనిస్‌ రూ. 15 లక్షలు అడిగితే.. మీరు రూ. 13 లక్షలు ఇస్తామన్నారు. ఇదేనా సీనియర్‌ క్రికెటర్లకు ఇచ్చే విలువ. మీరు అండర్‌ 19 స్థాయి క్రికెట్‌ ఆడిన వారితో కోచింగ్‌ ఇప్పిస్తామంటే మన రాతలు ఎప్పటికీ మారవు' అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, February 7, 2020, 14:53 [IST]
Other articles published on Feb 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X