11 ఏళ్ల ఐపీఎల్‌లో తొలిసారి: ఆరెంజ్ క్యాప్‌ అందుకోవడంపై ధావన్

Posted By:
Shikhar Dhawan Expresses His Happiness For Receiving Orange Cap For The First Time

హైదరాబాద్: గత కొన్నేళ్లుగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలే సఫారీ గడ్డపై కూడా అద్భుత ప్రదర్శన చేసి టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇక, ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ విషయానికి వస్తే ఆరంభం నుంచీ ఏదో ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

శిఖర్ ధావన్ ప్లేయర్ ప్రోఫైల్ గురించి తెలుసుకోండి

సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర

సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర

2013 నుంచి సన్ రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకు ఆడుతోన్న శిఖర్ ధావన్... 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. 2016 సీజన్‌లో శిఖర్ ధావన్ టోర్నీ మొత్తం మీద 17 మ్యాచ్‌లాడి 501 పరుగులు చేశాడు. అంతేకాదు గత కొన్ని సీజన్లుగా టోర్నీలో అత్యధిక పరుగులు ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు దక్కించుకుంటున్నాడు.

గత పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోని ధావన్

గత పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ దక్కించుకోని ధావన్

అయితే గత పదేళ్ల ఐపీఎల్ చరిత్రలో శిఖర్ ధావన్ ఇప్పటి వరకు ఆరెంజ్ క్యాప్ దక్కించుకోలేదు. ఐపీఎల్ టోర్నీలో ఆరంభం నుంచీ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లు ఎవరైతే అగ్రస్థానంలో కొనసాగుతారో వారికి ఆరెంజ్ క్యాప్‌ను నిర్వాహకులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధావన్(45: 28 బంతుల్లో 8ఫోర్లు)తో అలరించాడు.

రాజస్థాన్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

రాజస్థాన్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

ఇక, ఐపీఎల్ 11వ సీజన్‌లో భాగంగా సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 బంతుల్లో 13ఫోర్లు, సిక్సుతో 77 నాటౌట్‌గా నిలవడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. దీంతో రెండు మ్యాచ్‌ల్లో కలిపి శిఖర్ ధావన్ 122 పరుగులు చేయడంతో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

చాలా గొప్పగా అనిపిస్తోంది

దీంతో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడంతో ధావన్‌కు గురువారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ బహుకరించారు. ఈ సందర్భంగా ధావన్ 'చాలా గొప్పగా అనిపిస్తోంది. 11 ఏళ్లలో తొలిసారి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాను. దీనిపై చాలా సంతోషంగా ఉన్నా' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 13, 2018, 16:17 [IST]
Other articles published on Apr 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి